త్వరలో స్టార్ యాక్టర్ అర్జున్ కూతురు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ నటుడితోనే ఆమె పెళ్లి జరగబోతున్నుట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.
యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. కన్నడ పరిశ్రమకు చెందిన వాడైన తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో ఇక్కడే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981 నుంచి ఇప్పటి వరకు వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. మరోవైపు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ (Aishwarya) కూడా ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. ఇప్పటికే మూడు చిత్రాలతో అలరిచింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉంటే ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటు ఎక్కబోతున్నట్టు కోలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమిళ కమెడియెన్ అయిన తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఆమె పెళ్లి జరగబోతున్న ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఐశ్యర్య, ఉమాపతి కూడా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలు్సతోంది. దీంతో వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే వీరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. తర్వలో వీరిద్దరి పెళ్లి ఖాయమని అంటున్నారు. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబాలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఉమాపతి విషయానికొస్తే కోలీవుడ్ లో ఇప్పటికే నటుడిగా సినిమాలు చేస్తున్నారు. 2017లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారకు. పలు టీవీ షోల్లోనూ సందడి చేశారు. నాలుగు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ‘దేవదాస్’ అనే సినిమాలు నటిస్తున్నారు.
మరోవైపు 2013 నుంచి ఐశ్వర్య అర్జున్ తమిళ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభిచింది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే ఈ స్టార్ కిడ్ అవకాశాలు అందుకుంటోంది. అటు కన్నడలోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ మధ్యలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మిస్ అయ్యింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన నటించాల్సి ఉంది. ఆయా కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆమె గురిపెట్టింది.
Actor and Director Umapathy Ramaiah (Actor and Director 's Son) and Aishwarya Arjun (Actor and Director ’s Daughter) to tie the knot soon. pic.twitter.com/MwcsLftPmH