‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి.. కార్తికేయ, నేహా శెట్టి సందడి.. తర్వలో టీజర్!

By team teluguFirst Published Jan 29, 2023, 6:37 PM IST
Highlights

RX100 హీరో కార్తీకేయ - నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012). ఈరోజుతో షూటింగ్ ను పూర్తి చేసుకుంది.  త్వరలో ఆసక్తిరమైన టీజర్ కూడా రాబోతోంది.
 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు  ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ. గ్రామీణ నేథప్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. హీరోయిన్ గా  ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి  (Shetty) ఆడిపాడుతోంది.  ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపుదిద్దుకుంటుంది. రచన - దర్శకత్వం: క్లాక్స్ వహిస్తున్నారు. 

అయితే ఈరోజుతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తైంది. దీంతో సెట్స్ లో భారీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.  ఈ సందర్భంగా కార్తికేయ, నేహాశెట్టి చిత్ర యూనిట్ తో కలిసి సందడి చేశారు. చిత్రీకరణ అనుకున్నట్టుగా పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం 'వరల్డ్ అఫ్ బెదురులంక' అని విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచగా త్వరలో ఆసక్తికరమైన టీజర్ ని కూడా విడుదల చేయనున్నారని తెలిపారు. 

ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. టీజర్ తోపాటు త్వరలో విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందిస్తున్నారు. ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించడం విశేషం.
 

click me!