కింగ్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’. జనవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీగా మారింది. లేటెస్ట్ కలెక్షన్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
బాలీవుడ్ కింగ్ ఖాన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. షారూఖ్ ఖాన్ కు జోడీగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) నటించింది. మరో ప్రధాన ప్రాత్రలో జాన్ అబ్రహం నటించారు. ఇక కామియోలో సల్మాన్ ఖాన్ సైతం అలరించారు. సినిమాకు ఆనంద్ కథ అందించగగా, శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే రాశారు. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైందీ చిత్రం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘పఠాన్’ తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. రోజు వందకోట్ల చొప్పున వరల్డ్ వైడ్ గా వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. హిందీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో `కేజీఎఫ్2` ‘బాహుబలి’ క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసింది. ఇక నాలుగో రోజు కలెక్షన్లతో హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్ గా పఠాన్ నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా నాలుగో రోజు పఠాన్ సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా అందిన రిపోర్టుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా రూ.104 కోట్లకు పైగా గ్రాస్ మరియు రూ.53 కోట్లకు పైగా నెట్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల నివేదికలు తెలుపుతున్నాయి. మొత్తం నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.429 కోట్లు వసూల్ చేసి హిందీలో ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఐదో రోజు కలెక్షన్స్ మరో సాలిడ్ నెంబర్ ను రీచ్ కానుందని తెలుపుతున్నారు. ఇండియా వైడ్ గా రూ.265 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో రూ.164 కోట్లు వసూల్ చేసిందని తెలుస్తోంది. ఇక ఆదివారం కలెకన్లతో బిగ్ నెంబర్ గా నిలవనున్నట్టు అభిప్రాయపడుతున్నారు
మరోవైపు ‘పఠాన్’ కలెక్షన్ల సునామీతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో పస తగ్గింది. షారుఖ్ ఖాన్ ఒక ఫేడింగ్ స్టార్ అంటూ వచ్చిన విమర్శలపై అభిమానులు తిప్పికొడుతున్నారు. పఠాన్ కలెక్షన్లు చూపిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తం ఈ చిత్రంతో బాలీవుడ్ కు ఊపిరి వచ్చినట్టైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీకెండ్‌లోనే సినిమా ఐదువందల కోట్ల గ్రాస్‌ని రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్‌లోరూ ఈ సినిమాకు మరో రెండు వందల కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.