తెలుగు హీరోయిన్ దివ్యవాణి (Divyavani) పలు విభేధాల కారణంగా తన భర్తకు దూరంగా ఉందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. అసలు విషయం చెప్పేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన దివ్యవాణి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. డైరెక్టర్ ఏ కొందరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సర్దార్ క్రిష్ణమనాయుడు’ చిత్రంలో సూపర్ స్టార్ క్రిష్ణకు కూతురిగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హీరోయిన్ గానూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకు 40కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె ‘పెళ్లి పుస్తకం’,‘మొగుడు పెళ్లాల దొంగాట’ చిత్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.
దివ్యవాణికి అతి చిన్నయస్సులోనే పెళ్లి జరిగింది. దేవానంద్ అనే బిజినెస్ మెన్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు కిరణ్ కాంత్ కాగా. కూతురు తరుణ్యాదేవి. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కాస్తా సినిమాలకు దూరమయ్యారు. పదేండ్ల గ్యాప్ తర్వాత ‘రాధా గోపాళం’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ‘పంచాక్షరి’,‘వీర’,‘మహానటి’ చిత్రాల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ప్రేక్షకులను అలరించారు.
అయితే, ఇటీవల దివ్యవాణి తన భర్తకు దూరంగా ఉన్నారంటూ కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. పలు విబేధాల కారణంగా దూరమయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివ్యవాణికి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘నేను, నా భర్త విడిపోయినట్లు వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఆయన బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారు. దీంతో కర్ణాటక, ఏపీ వంటి ప్రాంతాలకు తరుచూగా ప్రయాణిస్తుంటారు. దీంతో ఇంట్లో ఎక్కువగా ఉండరు. ఆయన నా నిర్ణయాలను ఎప్పుడూ నివారించలేదు. అదీగాక మంచి సలహాలు, సూచనలు ఇస్తుంటారు కూడా. వ్యాపార పనుల్లో బిజీగా ఉంటారు.. కనుక పిల్లల్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది’ అంటూ పుకార్లను ఖండించారు.
మరోవైపు రాజకీయాల్లో సినిమా వాళ్ల పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ‘సినిమాళ్లమనగానే అందంగా ఉంటారు, చనువు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిని నేను చాలా దూరం పెడుతాను. కానీ సినిమా వాళ్లను రాజకీయాళ్లో చులకనగా చూస్తారని భావిస్తున్నారు. కొంతమంది వల్ల సినిమా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంద’ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్న దివ్యవాణి 2019 నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక గతేడాది ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ఈమె ‘పుత్తడిబొమ్మ’ సీరియల్ లోనూ నటించి.. టీవీ ఆడియెన్స్ ను అలరించారు.