
ఇలా షూటింగ్ స్టార్ట్ చేసుకుని.. అలా కంప్లీట్ చేసుకుని.. అనుకోకుండానే రిలీజ్ అయ్యింది బంగార్రాజు (Bangarraju) మూవీ. పెద్దగా ప్రమోషన్లు కూడా చేయకుండా రిలీజ్ చేసిన ఈ మూవీకి జనం బ్రహ్మరథం పట్టారు.
అక్కినేని ఫ్యామిలీ స్టార్స్ , తండ్రీ కొడుకులు నాగార్జున(Nagarjuna ),నాగచైతన్య (Naga Chaitanya) హీరోలుగా నటించిన సినిమా బంగార్రాజు. 2016 లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీకి.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జున (Nagarjuna ) సరసన హీరోయిన్ గా రమ్మకృష్ణ నటించగా.. నాగచైతన్య జోడీగా యంగ్ స్టార్ కృతి శెట్టి నటించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈమూవీని నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేశారు. సంక్రాంతికి సీజన్ కావడం..పెద్ద సినిమాలు ఏవీ పోటీకి లేకపోవడం బంగార్రాజుకు బాగా కలిసి వచ్చింది. సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. మూవీ.
నిజానికి బంగార్రాజు (Bangarraju) సినిమాను పెద్ద సినిమాలు పోటీకి ఉన్నా సరే.. సంక్రాంతికే రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు నాగార్జున (Nagarjuna ). అసలు ఈ సినిమా కూడా రెండు మూడేళ్ల క్రితం నుంచీ నాన్చుతూ వచ్చారు. ఇక షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే నాలుగే నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేశారు.
ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బంగార్రాజు (Bangarraju).. థియేటర్లకు సంక్రాంతి సంబరాలు తీసుకొచ్చింది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో విన్నర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ జోష్ లో ఉన్నారు బంగార్రాజు (Bangarraju) టీమ్. మూవీని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతూ టీమ్ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
ఈ మూవీ సక్సెస్ అనూప్ రూబెన్స్ పాటలు కీలకమైన పాత్రను పోషించాయి. అచ్చమైన ఆధ్ర స్లాంగ్ తో పాటు సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) .. బ్యూటీ క్వీన్ కృతి శెట్టి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. అంతే కాదు చాలా కాంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న నాగార్జున(Nagarjuna )కు సంక్రాంతి విజయం జోష్ ను నింపింది. చాలా తక్కువ టైమ్ లో 50 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటిన బంగార్రాజు (Bangarraju) .. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని అంచనా.