
సూపర్‌స్టార్ రజనీకాంత్(rajinikanth new movie) గురించి స్పషల్ గా గా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్టార్ ఆయన. ఆయను.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ కేంద్రం ఇటీవల సత్కరించింది. ఆయన సినిమాలు వరస ఫ్లాఫ్ అయినా క్రేజ్ కు కొదర ఉండదు. అయితే కొంత కాలంగా ఆయన సరైన హిట్ కొట్టలేదు. దానికి తోడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య విడాకులకు అప్లై చేసారు. ఈ నేపధ్యంలో ఆయన తన కొత్త సినిమా చేస్తారా ..చేయరా...చేస్తే ఎలాంటి సినిమా చేస్తారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన ఓ కథను ఓకే చేసారట. త్వరలోనే ఎనౌన్సమెంట్ రానుంది. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే నెల్సన్ దిలీప్ కుమార్ అని చెప్తున్నారు.
వివరాల్లోకి వెళితే...తమిళనాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నయనతార ప్రధాన పాత్రధారిగా ఆయన రూపొందించిన 'కొలమావు కోకిల' అక్కడ సూపర్ హిట్. చాలా తక్కువ బడ్జెట్ లో ఒక ఆసక్తికరమైన సినిమాను ఎలా తీయవచ్చుననడానికి నిదర్శనంగా ఆ సినిమా కనిపిస్తుంది.
ఇక ఇటీవల ఆయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన 'డాక్టర్' సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టి, కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఆయన దర్శకత్వంలోనే ఇప్పుడు విజయ్ 'బీస్ట్' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయనను పిలిచిమరీ రజనీకాంత్ అవకాశం ఇచ్చారనేది తమిళనాట టాక్.
ఈ మధ్య కాలంలో రజనీకాంత్ యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. అలాగే ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ టాలెంట్ ను గుర్తుంచి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఆ తరువాత లోకేశ్ కనగరాజ్ తో రజనీ సినిమా ఉండొచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. లోకేశ్ ప్రస్తుతం కమల్ సినిమా 'విక్రమ్'తో బిజీగా ఉన్నాడు.