పవన్‌కు అభిషేకం చేసే అవకాశం కావాలంటూ.. బండ్ల గణేష్ ట్వీట్

Published : Sep 02, 2020, 08:57 AM IST
పవన్‌కు అభిషేకం చేసే అవకాశం కావాలంటూ.. బండ్ల గణేష్ ట్వీట్

సారాంశం

పవన్‌ కళ్యాణ్ బర్త్‌ డే రోజు బండ్ల గణేష్ ట్వీట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే స్పందించాడు బండ్ల గణేష్. ఏకంగా పవన్‌ కళ్యాణ్ ను పరమ శివుడితో పోలుస్తూ ట్వీట్ చేశాడు.

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు ఎంత  మంది ఫ్యాన్స్‌ ఉన్నా బండ్ల గణేష్ స్థానం ప్రత్యేకం. పవన్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన గణేష్ తరువాత ఆయన హీరోగా తీన్‌మార్‌, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను నిర్మించాడు. గబ్బర్‌ సింగ్ సినిమా అఖండ విజయం సాధించటంతో పవన్ మీద గణేష్‌ అభిమానం భక్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ వేదిక మీద ఛాన్స్‌ దొరికినా పవన్‌ కళ్యాణ్‌ను దేవుడిగా పొగిడేస్తుంటాడు గణేష్.

అందుకే పవన్‌ కళ్యాణ్ బర్త్‌ డే రోజు బండ్ల గణేష్ ట్వీట్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే స్పందించాడు బండ్ల గణేష్. ఏకంగా పవన్‌ కళ్యాణ్ ను పరమ శివుడితో పోలుస్తూ ట్వీట్ చేశాడు. `ఈశ్వర పరమేశ్వర పవన్ ఈశ్వర ఎప్పుడు నీకు మరోసారి అభిషేకం చేసే అదృష్టం అందుకో జన్మదిన శుభాకాంక్షలు బండ్ల గణేష్ @PawanKalyan #HBDpawankalyan` అంటూ కామెంట్ చేశాడు గణేష్.

కరోన పరిస్థితుల నేపథ్యంలో పవన్‌ బర్త్‌ డే వేడుకలు భారీగా నిర్వహించే అవకాశం లేకపోవటంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. గతంలో ఉన్న రీ ట్వీట్‌ రికార్డ్‌  లన్నింటినీ ఇప్పటికే చెరిపేసిన పవర్‌ స్టార్ ఫ్యాన్స్ తాజాగా తమ రికార్డ్‌ను తామే బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?