పవన్‌ కళ్యాణ్ ఒడిలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?

Published : Sep 02, 2020, 08:14 AM IST
పవన్‌ కళ్యాణ్ ఒడిలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?

సారాంశం

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌, మామకు ఓ మెమరబుల్‌ ఫోటోతో విషెస్  చెప్పాడు. తాను చిన్నతనంలో పవన్‌తో కలిసి ఆడుకుంటున్న ఫోటోను ట్వీట్ చేసిన సాయి తేజ్‌ `అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... #HBDPawanKalyan mama` అంటూ ట్వీట్ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బర్త్‌ డే సందడి ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగానే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ మొదలైంది. ఇక మెగా హీరోలు పవన్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌, మామకు ఓ మెమరబుల్‌ ఫోటోతో విషెస్  చెప్పాడు. తాను చిన్నతనంలో పవన్‌తో కలిసి ఆడుకుంటున్న ఫోటోను ట్వీట్ చేసిన సాయి తేజ్‌ `అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ... #HBDPawanKalyan mama` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి పసివాడిగా ఉన్న ఆ ఫోటో పవన్‌ కాలేజ్‌ డేస్‌లో తీసి ఉంటారనిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్లి లాంగ్‌ గ్యాప్‌ తీసుకోవటంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న వకీల్‌ సాబ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ మోషన్‌ పోస్టర్ పవన్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?