
పవన్ కళ్యాణ్ భక్తుడుని అని చెప్పుకునే నిర్మాత బండ్ల గణేష్ నిన్న చేసిన ట్వీట్ వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. తనను పట్టించుకోవటం లేదనే అర్దం వచ్చేలా.... ''ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా చనువు ఇవ్వడం, ఎక్కువగా ఆశించటం... ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుంది'' అంటూ ట్వీట్ కామెంట్ చేశారు. అలాగే మరొక ట్వీట్ లో ''ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా చింతించకండి.. అలాంటి వారు ఖరీదైన వాటిని వదిలేసి చౌకైన వాటిని ఎంచుకుంటారు.. వారికీ మీ విలువ తెలియదు'' అంటూ కామెంట్ చేశారు. దీనికి తోడు బండ్ల గణేష్ పేరుతో ఓ ఆడియో వైరల్ అయ్యింది.
మొదట వేసిన ట్వీట్ రివర్స్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ చాలా మంది బండ్లని సెటైర్స్ తో ఆడుకున్నారు. దాని ఇంపాక్టే బండ్ల పేరుతో వచ్చిన ఆడియో ఫైల్ అని అంటున్నారు. ఇవన్ని తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉన్నాయని గమనించిన బండ్ల వెంటనే నష్ట నివారణకు పూనుకున్నారు. వరసపెట్టి పవన్ కల్యాణ్ ని పొగుడుతూ ట్వీట్స్ వేయటం మొదలెట్టాడు.
పవన్...అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ అభిమానులు లేని చొటు కూడా లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.జై PawanKalyan దేవర అని, సూర్యుడి తేఙస్సుకు...చంద్రుడి చల్లదనానికి...పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు. జై PawanKalyan దేవర ఇలా వరసపెట్టి పవన్ ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని. ఆయన నా గాడ్ అంటూ ఎక్కడ సమయం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేసి హాట్ టాపిక్ అవుతుంటాడు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా నిలదొక్కుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత వరుస సక్సెస్ లు అందుకున్నాడు.
నిర్మాతగా కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. అలాగే పవన్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లలలో మాట్లాడే స్పీచ్ లు, ఉత్తేజపరిచే మాటలు పవన్ అభిమానులకు జోష్ కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ సారి బండ్లన్నకు ఆ అవకాసం రాలేదు. పవన్ ని ప్రేమగా దేవర అని పిలుచుకునే బండ్ల గణేష్ ని భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలవలేదని వినికిడి.
మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్ ఆ మధ్యన విడుదలైన ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో ఓ పాత్రలో నటించారు. ఇప్పుడు డేగల బాబ్జీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో కనపించనున్నారు. సినిమాలతో పాటు ప్రస్తుత, రాజకీయం సామాజిక అంశాలపై అప్పడప్పుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ కాంట్రవర్సీ అవుతూ ఉంటాడు బండ్ల గణేశ్. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకి కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే.