ఎవరి పండ్లు ఎవరు రాలగొడతారో.. బండ్ల గణేష్ నెంబర్ ఇదే- రోజా

First Published Dec 13, 2017, 6:09 PM IST
Highlights
  • తెలుగు పరిశ్రమ, రాజకీయాలపపై చర్చలో రోజా-బండ్ల గణేష్ మాటల యుద్ధం
  • పల్లు రాలగొడతానంటూ రోజా వ్యాఖ్యలు చేయడంతో బండ్లగణేశ్ సేమ్ రిప్లై
  • ఇద్దరి మధ్యా మాటల యుద్ధం సోషల్ మీడియాకు జనసేన-వైకాపా ఫ్యాన్స్ మధ్య రచ్చ

తెలుగు సినిమా పరిశ్రమలో వారసత్వ రాజకీయాలపై ఓ  న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చలో రోజా ఫోన్‌లైన్‌లో మాట్లాడుతూ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు తక్కువని రోజా విమర్శించారు. ఎందరో మహామహులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు, అల్లుడు గానీ కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారు. వీళ్లే కనుక చిరంజీవి కుటుంబసభ్యులు కాకపోయింటే అవకాశాలు ఎవరిస్తారు? వాళ్లకు ప్రతిభ ఉందా? లేదా? అనే విషయం తర్వాత అని, ముందు తెరకు పరిచయం కావడమనేదే చాలా ముఖ్యమని రోజా అన్నారు.

 

అయితే ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్ల గణేష్‌ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. రోజా వ్యాఖ్యలతో బండ్ల విబేధించడంతో... రోజాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వారసత్వ రాజకీయాల గురించి జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడంతో మధ్య మాటలు శ్రుతి మించాయి. పవన్ కల్యాణ్‌ని మీరు వాడు వీడు అంటే నాకు కోపమొచ్చింది. ఇప్పుడు, కల్యాణ్ బాబు గారని మీరన్నారు. నేనేమి మాట్లాడలేను. నాకు మీరంటే గౌరవం. ఆయణ్ని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా? అని బండ్ల గణేశ్ అనడంతో... రోజా సమాధానం ఇస్తూ మీరంటే కూడా నాకు గౌరవం ఉంది. ఆవేశపడకండి, నేను చెప్పేది వినండని అన్నారు.


కల్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? జగన్ గారిని పవన్ కల్యాణ్ ఏమన్నాడమ్మా? పవన్‌ను వాడూవీడూ అని మీరు అనొచ్చా? గౌరవం ఇవ్వండి మేడమ్ అని రోజాను ప్రశ్నించారు. దీనిపై రోజా స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని జగన్ ఏమైనా అన్నారా? జగన్ గారిని ఎందుకంటున్నారు? అంతేకాదు వాడూ వీడూ అని ఎవరూ మాట్లాడలేదు... మీరు ఆవేశం తగ్గించుకోవాలని ఆమె హితవు పలికారు. అలాగే పాయింట్ మాట్లాడటం నేర్చుకోండని రోజా అన్నారు.

దీంతో రెచ్చిపోయిన బండ్ల.. అవును... పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు ... ఒకసారి గెలిచారు... మీది గోల్డెన్ లెగ్ అని దేశం మొత్తం కోడై కూస్తోంది. ఆ గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉండి, ఆయణ్ని సీఎంను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజశేఖరరెడ్డిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి అని వ్యంగ్యంగా అన్నారు.

 

ఈ వార్ టీవీ షో నుండి సోషల్ మీడియాకు పాకి ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇటు పవన్ అభిమానులు, అటు వైసీపీ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. అయితే.. వైకాపా ఎమ్మెల్యే రోజా.. ఏకంగా బండ్ల గణేష్ ఫోన్ నెంబర్ షేర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.

 

click me!