
సినిమా అయినా.. రాజకీయం అయినా.. ఏదైనా సరే తనదైన స్టైల్లో కామెంట్లు చేస్తూ.. తను టార్గెట్ చేసిన వ్యాక్తులకు గట్టిగా తగిలేలా కౌంటర్లు ఇస్తుండటాడు బండ్లగణేష్. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల.. ఆతరువాత నిర్మాతగా.. రాజకీయ నాయుడిగా తన మార్క్ చూపించారు. కాంట్రవర్శియల్ కామెంట్స్ తో ఎప్పుడూ.. ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ వస్తోన్న బండ్ల గణేష్.. ముఖ్యంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ.. ఇండైరెక్టర్ గా చేసే వ్యాఖ్యలు ఇంకా హైలెట్ గా నిలుస్తున్నాయి.
బండ్ల గణేశ్ ఏం చేసినా సంచలనమే... ఏం మాట్లాడినా సంచలనమే. సోషల్ మీడియాలో బండ్ల పోస్ట్ పెట్టాడంటే.. ఏం పెట్టుంటాడు అని ఆత్రుతగా చూస్తుంటారు అభిమానులు. నెట్టింట్లో యామా యాక్టివ్ గా ఉండే బండ్ల గణేశ్... తనకు నచ్చని విషయాలపై, నచ్చని వ్యక్తులపై చేసే ట్వీట్లు ఎప్పుడూ.. సంచలనాలు సృష్టిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవర్ కళ్యాన్ కు వీర విధేయుడు... పరమ భక్తుడు కావడంతో.. ఆయనపై ఎవరైనా ఏదైనా వాగినా.. తిట్టినా.. వారిపై తనదైన స్టైల్లో విరుచుకుపడతారు.
ఇక ప్రస్తుతం బండ్లగణేష్ కుసబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా బండ్ల గణేశ్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతే కాదు ఆయన చేతికి సెలైన్ కూడా ఉండటంతో ఆయనకు ఏమయిందనే చర్చ జరుగుతోంది. ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారని, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.