ఇది నీ రేంజ్ కాదు... బండ్ల గణేష్ పై ట్రోలింగ్ షురూ!

By Sambi ReddyFirst Published Dec 8, 2022, 4:29 PM IST
Highlights


బండ్ల గణేష్ ని నెటిజెన్స్ ఇది నీ రేంజ్ కాదని ట్రోల్ చేస్తున్నారు. ఒక పేద కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం చేశారు. అయితే బండ్ల గణేష్ అందించిన మొత్తం విమర్శలకు గురవుతుంది. 
 

బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎవరైనా సాయం కోరితే బండ్ల గణేష్ స్పందిస్తారు. తోచిన మేరకు సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. బండ్లన్న సహాయం చేయండి అంటూ... అప్పుడప్పుడు ఆయన్ని ట్యాగ్ చేసి సహాయం కోరుతూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ దృష్టికి ఒక హృదయ విదారక సంఘటన వచ్చింది. మేడ్చల్ కి చెందిన మొల్లంగర వెంకటయ్యకు ముగ్గురు కూతుళ్లు. చిన్నప్పటి నుండి అందరి పిల్లల్లానే ఆడుతూ పాడుతూ తిరిగారు. టీనేజ్ వచ్చాక సడన్ గా ముగ్గురు అంగవైకల్యానికి గురయ్యారు. 

వెంకటయ్య వైద్యం కోసం ఉన్నదంతా అమ్మినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన కూతుళ్లు నడవలేకపోతున్నారు. దీన స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని వెంకటయ్య కుటుంబం వీడియోలో అభ్యర్ధించారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి చేరేలా చేయాలి అనుకున్నారు. అలాగే దాతలు ఆర్థిక సహాయం చేయాలని వాట్సాప్ నంబర్ జోడించారు. ఈ వీడియోపై బండ్ల గణేష్ స్పందించారు. 

https://t.co/STEHk5InjX pic.twitter.com/ayov6FkdBV

— BANDLA GANESH. (@ganeshbandla)

వెంకటయ్య కుటుంబానికి రూ. 1000 సహాయం చేశాడు. గూగుల్ పే చేసి, స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే కోట్లు రూపాయలతో సినిమాలు తీసే నిర్మాత, వ్యాపారస్తుడు అయ్యుండి... ఏదో మధ్యతరగతి వాడిలా వెయ్యి రూపాయలు సహాయం చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. స్పందించి ఎంతో కొంత సహాయం చేశారు మంచిది. అయితే చీఫ్ గా వెయ్యి రూపాయలేంటి. అది నీ రేంజ్ కాదన్నా, అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. 
 

click me!