కావాలనే నన్ను టార్గెట్ చేశారు..బండ్ల గణేష్ కామెంట్స్!

Published : Dec 20, 2018, 12:19 PM ISTUpdated : Dec 20, 2018, 12:43 PM IST
కావాలనే నన్ను టార్గెట్ చేశారు..బండ్ల గణేష్ కామెంట్స్!

సారాంశం

తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని బండ్ల గణేష్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోవడంతో అందరూ బండ్ల మీద పడ్డారు. బ్లేడ్ పట్టుకొని అతడి చుట్టూ తిరిగారు. 

ఎన్నికల ఫలితాల తరువాత బండ్ల గణేష్ స్పందించి ప్రచార సమయంలో చాలా అంటామని తప్పించుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో కొన్ని మీడియా సంస్థలు తనను కావాలనే టార్గెట్ చేశాయని అన్నాడు.

కొందరు బ్లేడుతో తన ఇంటి వద్ద కాపుకాశారని, అది చూసి తన భార్యాబిడ్డలు భయబ్రాంతులను గురయ్యారని వారికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో నాయకులు చాలానే అంటారని కేసీఆర్, మోదీ వీడియోలను చూపిస్తూ వారు హామీలిచ్చి మాట తప్పిన విషయాలను నిరూపించారు.

వారందరినీ ఏం చేయలేరని, తాను బలహీనుడిని కాబట్టి ఇలా టార్గెట్ చేశారని అన్నారు. గెలిచిన టీఆర్ఎస్ నాయకులను తాను ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశాడు.  

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ