ప్రొడ్యూసర్, పొలిటిషన్ గా పరిచయమైన బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ మూవీలో లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను గతేడాది విడుదల చేయగా, తాజాగా చిత్రం నుంచి సోల్ ఫుల్ ట్రాక్ ను రిలీజ్ చేశారు.
ప్రొడ్యూసర్, పొలిటిషన్ గా దూసుకుపోతున్న బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ మూవీలో లీడ్ రోల్ లో నటించారు. నటుడిగా పలు పాత్రలు పోషించి మెప్పించిన బండ్ల గణేష్... మొదటిసారిగా కథానాయకుడిగా వెండితెరపై అలరించనున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంట్ చంద్ర దర్వకత్వం వహించారు.గతేడాది ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మర్డర్ కేసులో జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’.. పలు ఆరోపణలు ఎదుర్కొని, వాటి నుంచి బయటపడటమే ప్రధాన కథాంశం.
Here's the soulful track from out now
►https://t.co/y6CmXuGqkl
Music & Lyrics by 🎶
Sung by
Directed by pic.twitter.com/8QPDphKTv9
కాగా ఈ మూవీలోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.‘పుట్టగానే వాడు అస్సలే ఏడవలేదు.. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’.. ‘అసలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్ ఏమైనా ఉందా’ అంటూ గణేష్ చెప్పే డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. మరోవైపు పాత్రకు తగ్గట్టుగా గణేష్ ఓదిగిపోయారు. తాజాగా రిలీజైన ‘కలలే కన్నానే’ సోల్ ఫుల్ సాంగ్ కూడా మనస్సును కదిలించేలా ఉంది. ఈ సాంగ్ కు మ్యూజిక్ డైరెక్టర్ లైనస్ మాదిరి క్యాచీ టూన్ అందించారు.
బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ మూవీలో ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్నారు. యస్రిషి ఫిల్మ్స్ పతాకంపై ప్రొడ్యూసర్ ఎస్ స్వాతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ వెంకట్ చంద్ర మూవీని తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ : లైనస్, డీవోపీగా అరున్ దేవినేని వ్యవహరిస్తున్నారు.