సాయి తేజ్ యాక్సిడెంట్: ‘‘ ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకో’’ .. నరేష్‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బండ్ల గణేశ్

Siva Kodati |  
Published : Sep 11, 2021, 07:11 PM IST
సాయి తేజ్ యాక్సిడెంట్: ‘‘ ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకో’’ .. నరేష్‌కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బండ్ల గణేశ్

సారాంశం

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు నిర్మాత బండ్ల గణేశ్. ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోవాలని నరేశ్‌కు సూచించారు. భగవంతుడి దయతో ధరమ్ తేజ్ కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లు చేస్తాడని గణేశ్ ఆకాంక్షించారు. 

అంతకుముందు శనివారం ఉదయం సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించారు. సాయి ధరమ్ తేజ్ తమ ఇంటి నుంచే బయలుదేరాడని ఆయన చెప్పారు. తన కుమారుడు నవీన్ కలిసి సాయి ధరమ్ తేజ్ బైక్ రైడింగ్ చేస్తుంటాడని ఆయన చెప్పారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలా సార్లు హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడిని, సాయి ధరమ్ తేజ్ ను హెచ్చరించిట్లు ఆయన చెప్పారు. 

Also Read:సాయి ధరమ్ తేజ్ మా ఇంటి నుంచే, చాలాసార్లు హెచ్చరించా: నటుడు నరేష్

తన బిడ్డలాంటివాడని ఆయన అన్నారు. త్వరగా కోలుకుని తిరిగి సినిమా షూటింగులో పాల్గొనాలని ఆయన ఆశించారు. తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు తన అమ్మ బైక్ మీద వెళ్లననని ఒట్టు వేయించుకుందని ఆయన చెప్పారు. బైక్ లు ముట్టుకోకుండా ఉండడం మంచిదని ఆయన అన్నారు. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని కోరుకోవాలని కోరుకుంటున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని, ఏ సమస్య కూడా లేదని చెప్పారని శ్రీకాంత్ అన్నారు.
 
PREV
click me!

Recommended Stories

Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌