RX100: ఎమోషన్ చూడండి.. రొమాన్స్ కాదు

Published : Jul 23, 2018, 02:40 PM IST
RX100: ఎమోషన్ చూడండి.. రొమాన్స్ కాదు

సారాంశం

సినిమా రివ్యూ రాసేవాళ్లు తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్ సీన్స్ ను పక్కన పెట్టేసి 6 నిమిషాల రొమాన్స్ కోసం మాత్రం మాట్లాడడడం బట్టి వారి ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్ధమవుతోంది

ఈ మధ్యకాలంలో విడుదలైన చిన్న చిత్రాల్లో 'RX100' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ.10 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి సినిమాను విమర్శిస్తున్న వారిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు రివ్యూలను సినిమా విడుదలైన మూడు రోజుల వరకు బ్యాన్ చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావుని కోరారు. 'సినిమా రివ్యూ రాసేవాళ్లు తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్ సీన్స్ ను పక్కన పెట్టేసి 6 నిమిషాల రొమాన్స్ కోసం మాత్రం మాట్లాడడడం బట్టి వారి ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్ధమవుతోంది. ప్రజల మైండ్ లో అలాంటి  ఆలోచనలు లేవు కాబట్టి వారు ఎమోషన్ కు కనెక్ట్ అయ్యారు.

సినిమాలో రొమాన్స్ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్ధమవుతుంది అలా చేయకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారు. సినిమా విడుదలైన మూడు రోజులు రివ్యూలు బ్యాన్ చేయాలని మంత్రి గంటాను కోరుతున్నాను. నటుడు సినీల్ నుండి చిరంజీవి వరకు అందరూ ఈ సినిమాను మెచ్చుకున్నారు'' అని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్