Balayya with Raviteja: రవితేజనేకాదు.. తాను కూడా అమ్మాయిలకు లైన్‌ వేసేవాడినంటూ బాలయ్య షాకింగ్‌ కామెంట్‌

Published : Dec 22, 2021, 05:45 AM IST
Balayya with Raviteja: రవితేజనేకాదు.. తాను కూడా అమ్మాయిలకు లైన్‌ వేసేవాడినంటూ బాలయ్య షాకింగ్‌ కామెంట్‌

సారాంశం

మొదట రవితేజకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ.. `మొదలు పెట్టే ముందు బాసూ మనం ఓ క్లారిటీ తీసుకోవాలి.. నీకూ నాకు పెద్ద గొడవ అయిందట కదా?` అని ప్రశ్నించారు. దీనికి పెద్దగా నవ్వేసిన రవితేజ `పనీ పాటా లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని` అని సమాధానమిచ్చారు.

`అఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్‌ అందుకుని ఫామ్‌లోకి వచ్చిన బాలకృష్ణ ఇప్పుడు `అన్‌స్టాపబుల్‌` టాక్‌ తోనూ దూసుకుపోతున్నారు. వరుసగా క్రేజీస్టార్లని దింపుతూ `అప్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే`షోని రక్తికట్టిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్‌ 31న రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఈ షోలో సందడి చేసిన ఎపిసోడ్‌ ప్రసారంకానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇది ఏడో ఎపిసోడ్‌. బాలకృష్ణ ఇందులో రవితేజ నుంచి పలు ఆసక్తికర విసయాలను బోల్డ్ గా రాబట్టినట్టు తెలుస్తుంది. బాలకృష్ణతో రవితేజ గొడవ గురించి.. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం గురించి వెల్లడించిన అంశాలు హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదట రవితేజకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ.. `మొదలు పెట్టే ముందు బాసూ మనం ఓ క్లారిటీ తీసుకోవాలి.. నీకూ నాకు పెద్ద గొడవ అయిందట కదా?` అని ప్రశ్నించారు. దీనికి పెద్దగా నవ్వేసిన రవితేజ `పనీ పాటా లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని` అని సమాధానమిచ్చారు. తమ మధ్య గొడవలున్నాయనే వార్తలకు చెక్‌ పెట్టారు. అనంతరం `నీకు కోపం వచ్చినపుడు వాడే నాలుగు బూతులు చెప్పు సరదాగా` అని బాలయ్య అడగ్గా.. `నేను బూతులు మొదలు పెడితే చస్తారు కానీ` అన్నారు రవితేజ. `అతి వినయం ధూర్త లక్షణం.. చేతులు కట్టుకుంటే డిప్ప పగిలిపోయినట్టే` అని బాలకృష్ణ అనగా.. `అవతల వాడి బిహేవియర్ ని బట్టి వీడు తేడా గాడు అనే విషయం తెలిసిపోతుంది కదా మీకు` అని చెప్పడం నవ్వులు పూయించింది. 

`అమ్మాయిలకు లైన్ వేసేవాడివంట కదా` అని బాలయ్య అడగ్గా, `ఈ విషయాలన్నీ మీకు ఎవరు ఇచ్చారు?` అంటూ అవాక్కయ్యాడు రవితేజ. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ.. `మాది కృష్ణా జిల్లాయే బాసూ..తాను చిన్నపుడు అమ్మాయిలకు లైన్ వేసేవాడిని. కాలేజ్‌లో అమ్మాయిలకు` అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత `అవును మీ అబ్బాయి నీ కంటే టాలెంట్ కదా` అని బాలయ్య అడగ్గా.. `అందుకే వాడికి DNK అని పేరు పెట్టుకున్నా.. DNK అంటే దొంగ నా కొడుకు` అని రవితేజ చెప్పడం నవ్వులు పూయించింది. 

అనంతరం డ్రగ్స్ కి సంబంధించి బోల్డ్ గా అడిగేశాడు బాలకృష్ణ. `హెల్త్ కి, ఫిట్ నెస్ కు ఎంతో వాల్యూ ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు` అని అని ప్రశ్నించగా, `అందరి కంటే ముందు నాకే ఆశ్చర్యమేసింది. ఎక్కడ బాధ పడ్డానంటే.. పెంట పెంట చేశారు.. అది కొంచెం బాధేసింది` అని రవితేజ చెప్పుకొచ్చారు. దీనికి అవును అన్నట్లు బాలయ్య తలూపారు. అనంతరం దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఆహ్వానించారు. `గతంలో ఓసారి అరెస్ట్ అయ్యావంట కదా` అని బాలయ్య ప్రశ్నించారు. 'సమరసింహారెడ్డి' సినిమా విడుదల సమయంలో అరెస్ట్ అయ్యానని దర్శకుడు గోపీచంద్ తెలిపారు. రవితేజ కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడని.. తనతో చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే కొడతానంటూ గోపీచంద్ కు బాలకృష్ణ సరదా వార్నింగ్ ఇవ్వడం ఆకట్టుకుంది. 'ఈసారి లైట్లు సెట్లు లేకుండా.. ఓ చెట్టు కింద కూర్చుని ఓ రౌండ్ వేసుకుందాం.. ఏమంటావ్` అని బాలయ్య అనడం హైలైట్‌గా నిలిచింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే