
ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల వారసులు చాలా మంది ఉన్నారు. హీరోల వారసులుగా ఎక్కువ మంది హీరోలు అవుతుంటే.. కొంత మంది హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటి వరకూ హీరోల కూతుర్లు హీరోయిన్లు అయిన సందర్భాలు టాలీవుడ్ లో చాలా తక్కువ. ఈ ఆచారం బాలీవుడ్ లో ఎక్కుకవగా ఉటుంది.
బాలీవుడ్ లో సారాఅలీఖాన్, ఆలియా భట్,(Alia Bhat) కరీనా కపూర్(Karina Kapoor) లాంటి హీరోయిన్లు అలా వచ్చిన వాళ్లే.. కాని మన టాలీవుడ్ లో మాత్రం ఒకప్పుడు తమ హీరో కూతుళ్లు హీరోయిన్ గా రావడానికి ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కాదు. దాంతో హీరోయిన్ గా చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ చాలామంది తారలు కెమెరా ముందుకు రాలేకపోయారు.
ఇప్పుడు ట్రెండు మారింది ఎవరికి నచ్చినట్టు వారు తమకు నచ్చిన ప్రొఫిషన్ ను ఎంచుకుంటున్నారు.అలా ఇండస్ట్రీకి వచ్చినవారే రాజశేఖర్( Rajashekar)ఇద్దరు కూతుర్లు శివాణి–శివాత్మిక. వీరిద్దరు టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఓ మోస్తరు సినిమాలతో పర్వాలేదనిపిస్తున్నారు.
ఇక ఈ ఇద్దరిలో శివాణి(Shivani) సినిమాలు ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన అద్భతం సినిమాతో మంచి మార్కులేయించుకుంది శివాని. ఇక శివాత్మిక(Shivatmika) విషయానికి వస్తే ఆమె చేసిన 'దొరసాని' సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. కాని సినిమా మాత్రం అంతగా ఆడలేదు
శివాని-శివాత్మిక ఇద్దరూ నటన పరంగా మంచి పేరు వచ్చినా.. సినిమాల పరంగా మాత్రం కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు.తాము ఒక స్టార్ హీరో కూతుళ్లమనే విషయాన్ని పక్కన పెట్టేసి, తమకి నచ్చిన కథలను .. పాత్రలను చేయడానికి ఇద్దరూ కూడా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. అయినా సరే టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో తమ లక్ ను పరీక్షించుకోబోతున్నారు ఇద్దరు బ్యూటీలు.
తమిళంలో శివాని 'అన్బరివు' అనే ఒక సినిమా చేసింది. సంగీత దర్శకుడు, రెహమాన్ మేనల్లుడు,హీరో...జీవీ ప్రకాశ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో శివాని మోడ్రన్ గాళ్ గా చాలా సెక్సీగా కనిపించనుంది. జనవరి 7వ నుంచి డిస్నీ ప్లస్ 'హాట్ స్టార్' లో ఈసినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సిరీస్ సక్సెస్ అయితే తమిళ ఇండస్ట్రీలో శివాని సెటిల్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక శివాత్మిక కూడా 'ఆనందం విలయాడుం వీడు' అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. 'అభినందన' హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ ఈ సినిమాలో హీరో. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్టైనర్. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.
Also Read : Rajamouli Tweets: ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు అడ్డుతప్పుకున్నందుకు రాజమౌళి థ్యాంక్స్.. ఎవరెవరికి చెప్పాడంటే..?
ఎలాగు హీరో రాజశేఖర్ ది తమిళ బ్యాక్ గ్రౌండే.. భాష పరంగా కాని.. కాంటాక్ట్స్ పరంగా కాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక వేళ అక్కడ లైఫ్ వస్తే.. ఇద్దరు అక్కడే సెటిల్ అయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఇక తెలుగులో తమ కెరియర్ పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్న ఈ అక్కా చెల్లెళ్లిద్దరికీ కోలీవుడ్ హిట్లు ఇస్తుందో లేదో చూడాలి మరి.