స్టార్ సింగర్ బాలభాస్కర్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

By sivanagaprasad kodatiFirst Published Oct 2, 2018, 11:38 AM IST
Highlights

ప్రముఖ వయోలినిస్ట్.. గాయకుడు, సంగీత దర్శకుడు బాలభాస్కర్ కన్నుమూశారు. ఆయన వయసు 40 సంవత్సరాలు.. గత నెల 25న కుటుంబసభ్యులతో కలిసి త్రిస్సూర్‌లో దైవదర్శనం చేసుకుని తిరిగి తిరువనంతపురం వెళుతుండగా పల్లిప్పురమ్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో భాస్కర్ కుమార్తె తేజస్వి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భాలభాస్కర్, ఆయన భార్య శాంతకుమారి, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు తిరువనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు.

నాటి నుంచి మృత్యువుతో పోరాడుతున్న బాలభాస్కర్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సంగీత దర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించిన బాలభాస్కర్ స్టేజ్ షోలతో గాయకుడిగా.. వయోలినిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

12 ఏళ్ల వయసులోనే మ్యూజిషియన్‌గా మారి.. అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మలయాళ చిత్రపరిశ్రమలో రికార్డుల్లోకి ఎక్కారు. ‘‘మాంగల్య పల్లకు’’ అనే సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారిన బాలభాస్కర్.. ఎన్నో హిట్ సినిమాలకు స్వరకల్పన చేశారు.

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శివమణి, లూయిస్ బాంక్స్, హరిహరన్, ఫాజల్ ఖురేషి వంటి దిగ్గజాలతో కలిసి పనిచేశారు. బాలభాస్కర్ మరణంతో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.

click me!