బాలకృష్ణ,బోయపాటి చిత్రం టైటిల్ ఎనౌన్సమెంట్ ఆ రోజే

By Surya Prakash  |  First Published Mar 28, 2021, 12:38 PM IST

ఆ మధ్యన  ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ఈ సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లాలంటే త్వరగా ప్రకటన రావాలి. అందుకోసం నిర్మాత ఇప్పటికే టైటిల్ ఎనౌన్సమెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. డైరక్టర్ బోయపాటి ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగో రెడీ చేసి,బాలయ్యకు పంపారట. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎనౌన్సమెంట్ వచ్చేస్తుందంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు టైటిల్ ని ఉగాది సందర్బంగా ఎనౌన్స్ చేసే అవకాసం ఉంది. 

టాలీవుడ్ లో లో క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా విడుదల.  ఇప్పటిదాకా ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు.  ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. 

ఆ మధ్యన  ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడుతూండటంతో ఈ సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లాలంటే త్వరగా ప్రకటన రావాలి. అందుకోసం నిర్మాత ఇప్పటికే టైటిల్ ఎనౌన్సమెంట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. డైరక్టర్ బోయపాటి ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగో రెడీ చేసి,బాలయ్యకు పంపారట. బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎనౌన్సమెంట్ వచ్చేస్తుందంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు టైటిల్ ని ఉగాది సందర్బంగా ఎనౌన్స్ చేసే అవకాసం ఉంది. 

Latest Videos

ఇక ఈ చిత్రానికి  ‘మోనార్క్’ అనే టైటిల్ అనుకున్నాడు బోయపాటి. తాజాగా ‘గాడ్ ఫాదర్’ అనే పేరు వైపు మొగ్గు చూపుతున్నాడట. ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేస్తాడు అన్నది చూడాలి.  ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్ల షూటింగ్ జరుగుతోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడు.   

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్‌ను కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పిక్చరైజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ చేసే దిశగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమా వేసవి వినోదంగా మే 28న రిలీజ్ కానున్నది.
 
click me!