HBD Jr NTR: నీతో నా బంధాన్ని ఎలా వర్ణించాలి.. ఎన్టీఆర్ కి రాంచరణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్

Published : May 20, 2022, 11:01 AM IST
HBD Jr NTR: నీతో నా బంధాన్ని ఎలా వర్ణించాలి.. ఎన్టీఆర్ కి రాంచరణ్ ఎమోషనల్ బర్త్ డే విషెస్

సారాంశం

కనీసం కలలో కూడా ఊహించని కలయికని దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై ఆవిష్కరించారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజులకి సంబంధం లేనప్పటికీ రాజమౌళి ఆ పాత్రలతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశారు.

కనీసం కలలో కూడా ఊహించని కలయికని దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై ఆవిష్కరించారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజులకి సంబంధం లేనప్పటికీ రాజమౌళి ఆ పాత్రలతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం సృష్టించింది. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అన్నదమ్ముల తరహాలో వారి బంధం పెనవేసుకుంది. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రాంచరణ్ ఎన్టీఆర్ కి ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. 

'సోదరుడు, కోస్టార్, స్నేహితుడు.. నీతో బంధాన్ని వివరించడానికి నాకు మాటలు సరిపోవు తారక్.. మనమధ్య బంధాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. హ్యాపీ బర్త్ డే.. అంటూ రాంచరణ్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని ఎమోషనల్ గా హగ్ చేసుకున్న పిక్ షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ససోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా విషెస్ తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.  

 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు