Balakrishna With Liger Team: లైగర్ టీమ్ తో బాలయ్య..పూరితో సినిమాపై క్లారిటీ వస్తుందా..?

Published : Jan 09, 2022, 02:14 PM IST
Balakrishna With Liger Team: లైగర్ టీమ్ తో బాలయ్య..పూరితో సినిమాపై క్లారిటీ వస్తుందా..?

సారాంశం

లైగర్ టీమ్ తో కలిసి సందడి చేయబోతున్నారు నట సింహాం బాలకృష్ణ(Balakrishna). సినిమాలతో పాటు బుల్లి తెరపైకూడా సందడి చేస్తున బాలయ్య స్టార్ గెస్ట్ లతో అన్ స్టాపబుల్ అనిపిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సై అంటున్నారు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఎనర్జీ కూడా పెరుగుతుంది స్టార్ హీరోకి. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కిండంతో పాటు బుల్లి తెరపై కూడా సక్సెపుల్ గా అన్ స్టాపబుల్ షోను రన్ చేస్తున్నారు. స్టార్.. సూపర్ స్టార్ గెస్ట్ లతో ఓ ఆట ఆడుకుంటూ.. ఆడిస్తూ.. బాలయ్య షోను సూపర్ సక్సెస్ చేసేస్తున్నారు.

ఇఫ్పటి వరకూ బాలకృష్ణ (Balakrishna) అన్ స్టాపబుల్ షో(Unstoppable )కు చాల మంది గెస్ట్ లు వచ్చారు. మంచు ఫ్యామిలీతో స్టార్ట్ చేసి.. నానీ, అఖండా టీమ్, రాజమౌళి, పుష్ప టీమ్, రవితేజ,మహేష్ బాబు, రానా, ఇలా స్టార్స్ అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ వస్తున్న బాలయ్యబాబు.. అందరితో తనదైన మార్క్ స్టైల్ కామెడీతో... ప్రశ్నలతో.. అలరిస్తూ.. ఆడియన్స్ ఆకట్టుకుంటున్నారు. వెండితెరపైనే కాదు.. బుల్లి తెరపై కూడా సింహం సింహమే అన్నట్టు దూసుకుపోతున్నరు బాలయ్య.

ఇక ఈసారి సంక్రాంతికి భారీ ట్రీట్ ప్లాన్ చేశారు Unstoppable టీమ్.లైగర్ టీమ్ తో అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్మెంట్ ను చూపించబోతున్నారు. లైగర్ టీమ్ నుంచి యంగ్ స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో పాటు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నారు. దీనికి సబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి రోజు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంద అంటూ Unstoppable యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

బాలయ్య బాబు సంక్రాంతి లుక్ లో పట్టు పంచెలో కనిపించగా.. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్నారు. బాలయ్య ఎనర్జీకి.. విజయ్ దేవరకొండ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని.. ఈ షోపై భారీ అంచనాలు పెరిగాయి. షోలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి.. బాలయ్య లైగర్ టీమ్ తో ఎలాంటి విషయాలు రాబడతారు అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. జనవరి 14 న ఈ ఎపిసోడ్ స్ట్రీమిగ్ అవ్వబోతుండగా.. ఆరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Also Read : Akhanda BlockBuster: రెమ్యూనరేషన్‌ పెంచిన బాలయ్య.. NBK107కి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ఇక లైగర్ టీమ్ దాదాపు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది. ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని ప్యాచ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే సినిమా దాదాపు కంప్లీట్ అయినట్టే. అగష్ట్ 25న రిలీజ్ కాబోతున్న ఈమూవీ లో బాలయ్యతో కూడా ఓ సడెన్ ఎంట్రీ ప్లాన్ చేశాడట పూరి. ఇంది ఎంత వరకూ నిజంమో .. ఈ షోలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ లైగర్ లో హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

Also Read : Surya- Karthi Multi Starrer Movie : స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సూర్య-కార్తి.. ఫ్యాన్స్ కు పండగే..

ఇటు బాలయ్య అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు. అఖండ హిట్ జోష్ లో ఉన్న బాలయ్య రెమ్యూనరేషన్ కూడా పెంచారట. ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో యాక్షన్ మూవీ చేస్తున్న బాలకృష్ణ ఆతరువాత అనిల్ రావిపూడితో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అటు పూరీ జగన్నాథ్ తో కూడా బాలయ్య సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు అనేది.. సంక్రాంతికి స్ట్రీమింగ్ కాబోతున్న లైగర్ స్పెషల్ ఎపిసోడ్ లో బాలయ్య,పూరీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Also Read : Rakul Preet Singh: అసత్యాలు ప్రచారం చేయకండి.. పెళ్ళి రూమర్స్ పై మండిపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?
Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాలో హైలైట్స్ ఇవే