భారీ ధరకు ఆర్ ఆర్ ఆర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్.. భాషల వారీగా ప్రసారమయ్యే ఛానల్స్ ఇవే!

By team teluguFirst Published May 26, 2021, 7:15 PM IST
Highlights

దాదాపు రూ. 300కోట్లకు పైగా చెల్లించి పెన్ ఇండియా సంస్థ ఆర్ ఆర్ ఆర్ హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. కొద్దిరోజులుగా ఈ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. నేడు అధికారికంగా పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటన చేయడం జరిగింది. 

ఆర్ ఆర్ ఆర్ మూవీపై దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ నెలకొని ఉందొ చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ప్రముఖ సంస్థ పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. దాదాపు రూ. 300కోట్లకు పైగా చెల్లించి పెన్ ఇండియా సంస్థ ఆర్ ఆర్ ఆర్ హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. కొద్దిరోజులుగా ఈ వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. నేడు అధికారికంగా పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటన చేయడం జరిగింది. 


పెన్ ఇండియా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ని వివిధ సంస్థలకు విక్రయించడం విశేషం. హిందీ మినహా మిగతా సౌత్ ఇండియా బాషలైన తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల డిజిటల్ రైట్స్ జీ 5 దక్కించుకుంది. హిందీతో పాటు ఇంగ్లీష్, కొరియన్, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్ భాషల డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కి దక్కాయి. 


ఇక శాటిలైట్ రైట్స్ సైతం వివిధ టీవీ చానెల్స్ కి దక్కడం విశేషం. హిందీ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు దక్కించుకోగా తెలుగు స్టార్ మా, కన్నడ స్టార్ కన్నడ, తమిళ్ స్టార్ తమిళ్ దక్కించుకున్నాయి. మలయాళం ఏషియా నెట్ దక్కించుకుంది. 


దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరగా అక్టోబర్ 13విడుదల తేదీగా ప్రకటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రేయా హీరోయిన్స్ గా నటిస్తున్నారు . 
 

click me!