బాలయ్య సినిమాల్లో ఆయన భార్య వసుందరకు పిచ్చిగా నచ్చిన సినిమా ఇదే..?

బాలయ్య సినిమాలంటే ఆయన అభిమానులకు పూనకాలే వస్తుంటాయి. అంతలా ఇష్టపడుతుంటారు. అది సరేమరి ఆయన భార్య వసుందరకు బాలయ్య సినిమాలో ఏది ఇష్టమో తెలుసా..? 
 

Balakrishna Wife Vasundhara Favorite Movie Reveals. Why She Loves Chennakesava Reddy JMS

నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నారు. వరుసగా సినిమాలతో సక్సెస్ మంత్రం జపిస్తున్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో సందడి చేసిన బాలకృష్ణ.. ఈమధ్యలో కొంత తడబడ్డాడు. కాని అఖండ సినిమాతో మరోసారి ఫామ్ లోకివచ్చిన ఆయన.. గత నాటుగు సినిమాలతో ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య  108 సినిమాలలో నటించారు. 

ఇక  రీసెంట్ గా ఎలక్షన్స్ కోసం కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్ర‌స్తుతం మెగా దర్శకుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో  109వ సినిమా చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. బాలయ్య తనకెరీర్ లో హిట్ ప్లాప్ రెండింటిని సమానంగా చూశారు.అభిమానులను అలరించడమే టార్గెట్ గా రకరకాల ప్రయోగాలు చేశారు బాలకృష్ణ. 

Latest Videos

బాలయ్య సినిమాలంటే.. ఆయన అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అయితే ఆయన అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అందరికి తెలిసిందే. కాని బాలయ్య సినిమాల్లో ఆయన దర్మపత్ని.. వసుంధరకు బాలయ్య సినిమాల్లో నచ్చే సినిమా ఏదో తెలుసా..? అదేంటో కాదు.. బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే ఆమెకు బాగా ఇష్టం అట. 2002లో వివి. వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి ఒక‌టి. 

ఈసినిమాలో బాలయ్యకు జోడిగా టబూ.. శ్రియ నటించారు. ఈ సినిమాలో బాలయ్యడ్యూయల్ రోల్ చేసి అలరించారు.  ఈ సినిమా అంటే బాలయ్య భార్య నందమూరి వసుంధరకు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈ సినిమా దర్శకుడు వినాయక్‌కి చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్య చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట.

ఈపాత్ర చేస్తున్నన్నిరోజులు బాలయ్యలో ఏదో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేదని.. ఇంట్లో కూడా ఈ పాత్ర గురించే తనతో ఎక్కువగా చర్చించే వారిని వసుంధర దేవి ఓ సందర్భంలో  వినాయక్ తో చెప్పారట. ఇక అప్పట్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.  యావ‌రేజ్ టాక్‌ తెచ్చున్నా కూడా.. చాలామందికి ఇది ఫెవరేట్ సినిమాగా నిలిచిపోయింది. దాదాపు 45 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది చెన్నకేశవరెడ్డి సినిమా.

click me!