ఇంద్ర చిత్రానికి ముందు జరిగిన సంఘటన, యాటిట్యూడ్ చూపించిన డైరెక్టర్.. నాగబాబు కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి ?

By tirumala AN  |  First Published Aug 21, 2024, 4:57 PM IST

ఇంద్ర చిత్రానికి ముందు చిరంజీవి నటించిన మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ లాంటి చిత్రాలు వర్కౌట్ కాలేదు. చిరంజీవి తన కెరీర్ లో చాలా సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. ఆ టైంలో కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 


గురువారం రోజు మెగాస్టార్ చిరంజీవి తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకోనున్నారు. చిరు బర్త్ డే సందర్భంగా ఇంద్ర చిత్రం రీ రిలిజ్ అవుతోంది. దీనితో సోషల్ మీడియాలో ఇంద్ర చిత్రానికి సంబంధించిన విశేషాలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇంద్ర ఒకటి. 

బి గోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆర్తి అగర్వాల్, సొనాలికి బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఇంద్ర చిత్రం అప్పటి ఇంకా ఖరారు కాక ముందు.. చిరంజీవి, నాగబాబు మధ్య ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. 

Latest Videos

ఇంద్ర చిత్రానికి ముందు చిరంజీవి నటించిన మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ లాంటి చిత్రాలు వర్కౌట్ కాలేదు. చిరంజీవి తన కెరీర్ లో చాలా సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. ఆ టైంలో కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంద్ర చిత్రం ఇంకా ఖరారు కాలేదు. 

కొందరు దర్శకులు, నిర్మాతలతో చిరంజీవి చర్చలు జరుపుతున్నారట. ఆ సమయంలో నాగబాబు చిరంజీవి దగ్గరకి వెళ్లారట. చిరు వ్యాయామాలు చేస్తుండగా.. ఒక డైరెక్టర్ గురించి చెప్పారు. ఆ టైంలో సదరు డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముట్టుకుంటే సూపర్ హిట్ పడుతోంది. అన్నయ్య ఒక డైరెక్టర్ ఉన్నాడు.. వరుసగా హిట్లు కొడుతున్నాడు. 

అన్నయ్య నువ్వు ఆ డైరెక్టర్ ని పిలిచి అతడితో సినిమా చేయొచ్చు కదా.. మంచి హిట్లు ఇస్తున్నాడు అని చెప్పా. అప్పుడు అన్నయ్య ఒక అద్భుతమైన మాట చెప్పారు. సక్సెస్ వెనుక మనం పడకూడదు. మనమే సక్సెస్ ని క్రియేట్ చేయాలి అని అన్నారు. ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే సక్సెస్ వస్తుందేమో.. కానీ నాకు అది అవసరం లేదు. 

ఆ డైరెక్టర్ కూడా నేను చాలా గొప్ప డైరెక్టర్ ని అనే యాటిట్యూడ్ ప్రదర్శించే వాడు. అది ఆయన నమ్మకం తప్పులేదు. అన్నయ్యతో నేను మాట్లాడిన నెల రోజులకి ఇంద్ర చిత్రం ఒకే అయింది. అన్నయ్య చెప్పినట్లుగానే అద్భుతమైన హిట్ కొట్టారు. అప్పటి నుంచి సినిమాల విషయంలో అన్నయ్యకి నేను ఎప్పుడూ సలహాలు ఇవ్వను. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని నాగబాబు అన్నారు. 

click me!