
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా మూవీ జనవరి 12న రిలీజ్ అయ్యింది. తొలిరోజున రికార్డ్ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రూ.54 కోట్ల మేరకు గ్రాస్ వసూళ్లను సాధించిన ఆ హవా చాలా రోజులు పాటు కొనసాగించింది. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సర్కారు వారి పాట’ తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్‌లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.
అయితే మరుసటి రోజే ‘వాల్తేరు వీరయ్య’ రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో ప్లో తగ్గింది. దాంతో వీరసింహుడుపై కలెక్షన్ల ప్రభావం పడింది. అంతేకాకుండా శనివారం ‘వారసుడు’ కూడా రిలీజ్ కానుంది. దాంతో థియేటర్ కౌంట్ చాలా వరకు తగ్గింది. అలాగే బాలయ్య సినిమాకు యుఎస్ లో సైతం ఎన్నడూ లేని విధంగా ఎక్కువ కలెక్షన్స్ రావటంపై ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేసారు. అయితే ఓవర్ సీస్ లో మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను అదే ఊపుని కొనసాగించలేకపోయింది.
ఇక ఈ చిత్రం థియేటర్ రైట్స్ ని 73 కోట్లుకు అమ్మారు. ఇక ఈ చిత్రం 74.1 కోట్ల షేర్ వచ్చింది.
నైజాం - రూ. ₹ 17 కోట్లు
సీడెడ్ - రూ. 15.2 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.8.8 కోట్లు
ఈస్ట్ - రూ. 5.6 కోట్లు
వెస్ట్ - రూ. 4.25 కోట్లు
గుంటూరు - రూ. 6.3 కోట్లు
కృష్ణా - రూ. 4.75 కోట్లు
నెల్లూరు - రూ. 2.7 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.64.6 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్ల ప్రకారం చూస్తే అది రూ.59.10 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 3.05 కోట్లు వచ్చాయి. ఓవర్ సీస్‌లో రూ. 5.2 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రూ.74.1 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి.