బాలయ్య హిట్ సాంగ్ కి స్టెప్స్ వేసిన మెగా కోడలు.. దుమ్మురేపుతున్న వీడియో!

Published : Feb 27, 2023, 11:24 AM IST
బాలయ్య హిట్ సాంగ్ కి స్టెప్స్ వేసిన మెగా కోడలు.. దుమ్మురేపుతున్న వీడియో!

సారాంశం

బాలయ్య లేటెస్ట్ హిట్ వీరసింహారెడ్డి చిత్రంలోని సాంగ్ కి మెగా కోడలు డాన్స్ వేశారు. ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.


చిరంజీవి ఫ్యామిలీ నుండి హీరో అయిన వాళ్ళల్లో కొణిదెల పవన్ తేజ ఒకరు. ఆయన హీరోగా 'ఈ కథలో పాత్రలు కల్పితం' టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మేఘనను కొణిదెల పవన్ తేజ వివాహం చేసుకోబోతున్నాడు. గత ఏడాది ఆగస్టులో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కొణిదెల పవన్ తేజ కి చిరంజీవి దూరపు బంధువు. చిరంజీవి అతనికి పెదనాన్న వరస అవుతాడని సమాచారం. ఆ విధంగా మేఘన మెగా ఇంటి కోడలు కాబోతుంది. 

కాగా వీరసింహారెడ్డి చిత్రంలోని సూపర్ హిట్ మాస్ నంబర్ 'సుగుణ సుందరి'కి మేఘన డాన్స్ వేసింది. ఆ వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. మేఘన డాన్స్ అద్భుతమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మేఘన యాంకర్ గా కూడా చేసినట్లు సమాచారం. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఝాన్సీలో ఒక పాత్ర చేశారు. మరికొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో నటించడం జరిగింది. 

మేఘన-పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థ వేడుకకు చిరంజీవి, సురేఖా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదిగేందుకు పవన్ తేజ్ కొణిదెల ట్రై చేస్తున్నారు. ఇక నందమూరి బాలయ్య పాటకు మెగా కోడలు డాన్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. థమన్ సంగీతం అందించిన 'సుగుణ సుందరి' సాంగ్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది. బాలయ్య-శృతి హాసన్ మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?