బాలకృష్ణ `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` 4వ సీజన్‌ స్టార్ట్ అయ్యేది అప్పుడే, ఫస్ట్ గెస్ట్ ఆ స్టార్‌ హీరోనా?

By Aithagoni Raju  |  First Published Oct 2, 2024, 2:27 PM IST

బాలయ్య హోస్ట్ గా మారి చేసిన `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` నాల్గో సీజన్‌ రాబోతుంది. ఈ మేరకు గుడ్‌ న్యూస్‌ వచ్చింది. క్రేజీ కంటెస్టెంట్ తో షో స్టార్ట్ కాబోతుందట. 
 


బాలకృష్ణ అంటే ఒక అభిప్రాయం ఉండేది. ఆయనకు కోపం ఎక్కువ, కొడతాడు. ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఆయన అలానే కనిపించారు. కానీ బాలకృష్ణ కంప్లీట్‌గా కొత్తగా చూపించిన షో `అన్‌ స్టాపబుల్ విత్‌ ఎన్బీకే`. ఈ టాక్‌ షోతో కొత్త బాలయ్యని మనం చూడొచ్చు. ఎంత జోవియల్‌గా ఉంటారో చూడొచ్చు. గత మూడు సీజన్లలో ఆయన తనని తాను ఆడియెన్స్ కి కొత్తగా పరిచయం చేసుకున్నారు.

తనదైన డైలాగులు, తనదైన హోస్టింగ్‌తో ఆకట్టుకున్నారు బాలయ్య. అసలు గతంలో సినిమాల్లో బాలయ్యని చూసినదానికి, అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే టాక్‌ షోకి పూర్తి భిన్నం. ఏమాత్రం పొంతనలేదు. మనం చూస్తున్నది బాలకృష్ణనేనా అని ఆశ్చర్యపోయేలా ఆయన కనిపించారు. అలా హోస్టింగ్‌ చేశారు. షోని ఆద్యంతం రక్తికట్టించేలా, ఫన్‌గా మార్చారు. అదే సమయంలో గెస్ట్ ల నుంచి అనేక కొత్త విషయాలను బయటకు తెచ్చారు. మోస్ట్‌ పాపులర్‌ షోగా దీన్ని మార్చారు. దీనికి విశేష స్పందన కూడా దక్కడం విశేషం. 

Latest Videos

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 4..

ఇక ఇప్పుడు కొత్త సీజన్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తయ్యాయి. `అన్‌ స్టాపబుల్ విత్‌ ఎన్బీకే` మొదటి సీజన్‌ బాగా నచ్చింది. అంత కొత్తగా చూశారు. మంచి రేటింగ్‌ కూడా వచ్చింది. ఇక రెండో సీజన్‌ మాత్రం దుమ్మురేపింది. బిగ్‌ స్టార్స్ సైతం ఈ సీజన్‌లోరావడంతో రెండో సీజన్‌ హైయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌ సాధించిన షోగా నిలిచింది. ఇందులో ప్రభాస్‌, మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ వంటి బిగ్‌ స్టార్స్ రావడం విశేషం. ఇక మూడో సీజన్‌ పెద్దగా నడవలేదు. పొలిటికల్‌గా ఎక్కువగా నడిచింది.

చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ నాయకులు, హీరోయిన్లు, దర్శకులు ఇందులో పాల్గొన్నారు. దీంతో మూడో సీజన్‌ చప్పగా సాగింది. పైగా అప్పట్లో రాజకీయ వేడి ఉన్న నేపథ్యంలో దీన్ని త్వరగానే కంప్లీట్‌ చేశారు. మూడో సీజన్‌ ఏమాత్రం పండలేదు. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు నాల్గో సీజన్‌ ప్రారంభించబోతున్నారు. అక్టోబర్‌లోనే ఈ షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలయ్య ఈ విషయాన్ని తెలిపారు. అన్‌ స్టాపబుల్‌ నాల్గో సీజన్‌ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. దీపావళి వరకు దీన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. 

`అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 4` ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నాల్గో సీజన్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నాల్గో సీజన్‌లో మొదటగా వచ్చే గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఓ బిగ్‌ స్టార్ ని దించబోతున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే అల్లు అర్జున్‌ పేరు వినిపిస్తుంది. అయితే బన్నీ మొదటి సీజన్‌ సమయంలోనే మెరిశాడు. కానీ పూర్తి ఎపిసోడ్‌కి కాదు, `పుష్ప` ప్రమోషన్‌లో భాగంగా ఆయన కాసేపు కనిపించి ఆకట్టుకున్నారు.

ఈ సారి ఆయన పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. మరి ఫస్ట్ గెస్ట్ ఎవరొస్తారనేది చూడాలి. అయితే ఫస్ట్ గెస్ట్ మలయాళ స్టార్‌ దుల్కర్‌ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన ఎపిసోడ్‌ మధ్యలో ఉంటుదంట. ఇప్పటికే ఆయనపై షూటింగ్‌ అయిపోయింది.  `లక్కీ భాస్కర్‌` టీమ్‌ దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్‌ మీనాక్షి కూడా ఇందులో పాల్గొన్నారట. ఈ ఎపిసోడ్‌ మధ్యలో టెలికాస్ట్ అవుతుందని సమాచారం. 

ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ బాలయ్య `అన్‌ స్టాపబుల్‌` నాల్గో సీజన్‌ ప్రారంభం కాబోతుందనే వార్త ఇప్పుడు అభిమానులను ఖుషి చేస్తుంది. మరోసారి బాలయ్య రచ్చ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యంగ్‌ హీరోలు, ముగ్గురు నాలుగురు స్టార్‌ హీరోలు వచ్చారు. ఇప్పుడు సీనియర్లు, దర్శకులు, నిర్మాతలు ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. ఈసీజన్‌లో వారిని కవర్‌ చేసే అవకాశం ఉంది. 

అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 4 క్రేజీ గెస్ట్ 

ఇంకా రావాల్సిన వారిలో చిరంజీవి ఉన్నారు. అలాగే వెంకటేష్‌ రాలేదు, నాగార్జున కూడా రాలేదు. వీళ్లు వస్తే నిజంగా షో రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. వీటికి మించిన మరో గెస్ట్ ఉన్నారు. అదే ఎన్టీఆర్‌. బాలయ్య బాబాయ్‌ షోకి తారక్‌ వస్తే ఆ మజా వేరే లెవల్‌. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. అంతేకాదు రామ్‌ చరణ్‌ కూడా ఈ షోకి రాలేదు. చాలా మంది స్టార్‌ డైరెక్టర్లు రాలేదు. హీరోయిన్లు కూడా రాలేదు. ఈ సీజన్‌లో ఎంత మందిని కవర్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పైన పేర్కొన్న స్టార్స్ గెస్ట్ గా వస్తే ఈ షో మరో స్థాయికి వెళ్తుందని చెప్పొచ్చు. మరి వాళ్లని కవర్‌ చేస్తారా? లేదా అనేది చూడాలి.
 

`ఆహా`లో అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షో 2021లో ప్రారంభమైంది. అల్లు అరవింద్‌ మదిలోనుంచి పుట్టిన షో ఇది. బాలయ్యతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి బాలకృష్ణ ఓకే చెప్పడంతో ఈ షో ప్రారంభమైంది. దీన్ని మొత్తం డైరెక్ట్ చేసింది ప్రశాంత్‌ వర్మ. ఈ ఐడియా, కాన్సెప్ట్ ని ఆయనే డిజైన్‌ చేశారు. అంతేకాదు దగ్గరుండి షోని చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చూసుకుంటారని తెలుస్తుంది. దీంతోపాటు బాలయ్యకి బ్యాక్‌ బోన్‌లా ఉన్నది ఆయన కూతురు తేజస్విని.

ఈ షో నుంచి ఆమె సినిమాల్లోకి యాక్టివ్‌గామారింది. ఆమె ప్రోత్సాహంతోనే బాలయ్య ఈ షోకి హోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆమె ఇన్‌ వాల్వ్ మెంట్‌ తర్వాత నుంచే బాలయ్య కథల ఎంపికలోనూ మార్పు వచ్చింది. యంగ్‌ జనరేషన్‌తో పనిచేయాలని ఆమె చెప్పినట్టు సమాచారం. ఆమెనే ఇప్పుడు బాలయ్యని గైడ్‌ చేస్తుందని టాక్‌. ఇక 2021లో మొదటి సీజన్‌ ప్రారంభం కాగా, 2022లో రెండో సీజన్‌, గతేడాది మూడో సీజన్‌ జరిగింది.

ఇప్పుడు నాల్గో సీజన్‌కి టైమ్‌ వచ్చింది. ఓటీటీ యాప్‌ `ఆహా`లో ఈ టాక్‌ షో స్ట్రీమింగ్‌ కానుంది. ఓ రకంగా ఈ ఓటీటీ రేంజ్‌ని పెంచిన షో గా `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షో నిలిచిందని చెప్పొచ్చు. అంతేకాదు ఇండియాలోనే హైయ్యేస్ట్ రేటింగ్‌ సాధించిన టాక్ షోగానూ ఇది నిలిచింది. మరి ఈ నాల్గో సీజన్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 
 

click me!