NBK: తండ్రిగా బాలకృష్ణ.. కూతురిగా యంగ్‌ హీరోయిన్‌.. ఫస్ట్ టైమ్‌ అలా..స్టోరీ లైన్‌ రివీల్‌

Published : May 24, 2022, 08:26 AM IST
NBK: తండ్రిగా బాలకృష్ణ.. కూతురిగా యంగ్‌ హీరోయిన్‌.. ఫస్ట్ టైమ్‌ అలా..స్టోరీ లైన్‌ రివీల్‌

సారాంశం

బాలయ్య ఓ హీరోయిన్‌కి తండ్రిగా కనిపించబోతున్నారు. అదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌. యంగ్‌ క్రేజీ హీరోయిన్‌కి బాలయ్య తండ్రిగా కనిపించబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది.

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) ఇప్పటికే తండ్రిగా నటించాడు. కాకపోతే తనకే తండ్రిగా చేశారు. ద్విపాత్రాభినయం చేస్తూ తండ్రి కొడుకులుగా నటించి ఆకట్టుకున్నారు. ఇలా చాలా సినిమాల్లో కనిపించారు బాలయ్య. ఇప్పుడు ఆయన ఓ హీరోయిన్‌కి తండ్రిగా కనిపించబోతున్నారు. అదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌. యంగ్‌ క్రేజీ హీరోయిన్‌కి బాలయ్య తండ్రిగా కనిపించబోతున్నారనే వార్త వైరల్‌ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే. 

బాలకృష్ణ ఇటీవల `అఖండ`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ ఊపులో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేనితో `NBK 107` చిత్రంలో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్‌ నటిస్తుంది. అనంతరం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇటీవల ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) కన్ఫమ్‌ చేశారు. అయితే ఈ స్టోరీ లైన్‌ ఏంటో కూడా రివీల్‌ చేశారు దర్శకుడు.

నెక్ట్స్ తన సినిమా బాలకృష్ణతోనే ఉంటుందని, ఫస్ట్ టైమ్‌ ఒక యాక్షన్‌ ప్యాక్డ్ చిత్రాన్ని చేయబోతున్నానని, ఇప్పటి వరకు తన నుంచి ఫన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలనే చూశారని, తనలోని మాస్‌, యాక్షన్‌ యాంగిల్‌ని చూస్తారని తెలిపారు అనిల్‌ రావిపూడి. ఆయన రూపొందించిన `ఎఫ్‌3` చిత్రం ఈ నెల 27న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ విషయాన్ని ఆయన తెలిపారు. అంతేకాదు బాలయ్య సినిమా లైన్‌ కూడా రివీల్‌ చేశారు. ఇది తండ్రి కూతుళ్ల మధ్య సాగే కథ అని తెలిపారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, ఎమోషన్స్ హైలైట్‌గా ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. 

బాలకృష్ణకి కూతురు పాత్రలో నటించే హీరోయిన్‌ ఎవరనేది కూడా రివీల్‌ చేశారు. `పెళ్లి సందడి`తో టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన శ్రీలీలా బాలయ్యకి డాటర్‌ రోల్‌ చేస్తుందని తెలిపారు. `పెళ్లిసందడి`తో యమ క్రేజ్‌ని సొంతం చేసుకున్న శ్రీలీలా(Sri Leela) వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఆమె రవితేజతో `ధమాకా`, నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు` చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పుడు బాలయ్యకి కూతురుగా కనిపించబోతుండటం విశేషం. 

ఈ లెక్కన ఈ సినిమాలో బాలయ్యకి హీరోయిన్‌ ఉండబోదని తెలుస్తుంది. ఆయన యాభై ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపిస్తారట. ఆ వయసున్న పాత్రకి హీరోయిన్లు సెట్‌ కారు. సీనియర్‌ హీరోయిన్లని పెట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి అనిల్‌ రావిపూడి, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే లైటర్‌ వేలో ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలు రూపొందించే అనిల్‌ రావిపూడి బాలయ్యని ఎలా డీల్‌ చేస్తారనే అనుమానాలున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు