Shekar: `శేఖర్` సినిమా ప్రదర్శనకి లైన్ క్లియర్

By Rajesh KFirst Published May 23, 2022, 11:19 PM IST
Highlights

Sekhar: రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్' గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా తీర్పు వ‌చ్చిన‌ట్టు  తెలుస్తోంది.
 

Sekhar: యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ హీరోగా నటించిన తాజా  చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయ‌న భార్య జీవితా రాజ‌శేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, వారికి ఈ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ చిత్ర ఫైనాన్షియర్  పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పరంధామరెడ్డి, జీవితా రాజశేఖర్ మధ్య త‌ల్లెత్తిన‌  ఆర్థిక పరమైన వివాదంతో పరంధామరెడ్డి కోర్టులో కేసు వేశారు. శేఖర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆయన సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసు కారణంగా శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.

అయితే తాజాగా ఈ మూవీ నిలిపివేతపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో జీవితా రాజశేఖర్‌, శేఖర్‌ చిత్ర బృందానికి అనుకూలంగా కోర్టు వ్యాఖ్యానించిన‌ట్టు సమాచారం. తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో శేఖర్‌ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం చెప్పిన‌ట్టు తెలిసింది.

కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని తాజాగా జీవిత రాజశేఖర్‌, నిర్మాత తరపు న్యాయవాదులు తెలిపారు. 


శేఖర్ సినిమా గురించి సోమ‌వారం న్యాయస్థానంలో వాదనలు జరిగాయి శేఖర్ సినిమా ఆగిపోవడంతో త‌మ‌కు ఎంతో నష్టం జరుగుతుందనీ, ఈసినిమా నెగటివ్ మీద ఉన్న స్టే ని ర‌ద్దు చేయాల‌ని జీవిత రాజశేఖర్ అడ్వకేట్స్ కోరారు. ఈ స‌మ‌యంలో పరంధామ రెడ్డి  తరపున అడ్వకేట్స్ సినిమా ప్రదర్శించుకొనుటకు మాకెటువంటి అభ్యంతరం లేదని, అయితే ఆవచ్చే కలక్సన్స్ లో మాక్లైంట్ల కు ఇవ్వ‌లసిన 87లక్షల10వేల రూపాయలని కోర్ట్ లో డిపాజిట్ చేయించాలని జడ్జిని కోరారు. 

ఈ వాద‌న‌తో  జడ్జి  ఏకీభవించారు. అందుకు జీవితా రాజశేఖర్ న్యాయవాదులు ఒప్పుకుంటూ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బు ని డిపాజిట్ చేస్తామని తెలియజేయడంతో ,రెండు రోజులలో ఆ అకౌంట్ వివరాల‌ను కోర్టుకు తెలియచేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో సినిమా ప్రదర్శనకు అనుమతి లభించిన‌ట్టు అయ్యింది.  

ఇక.. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని కోర్టు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం(మే 24న) విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా  రాజశేఖర్ ఓ ట్వీట్‌ చేశాడు. ఆసత్య ప్రచారం వల్ల తమ సినిమాను నిలిపివేశారని, శేఖర్‌ మూవీపై కోర్టు స్టే ఇచ్చిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.  
 


Thanking our audience for constantly standing by us! pic.twitter.com/9nTE5ulig9

— Dr.Rajasekhar (@ActorRajasekhar)
click me!