బాబి తో చేస్తున్న చిత్రం ఈ నెలాఖరకు షెడ్యూల్ పూర్తవుతుంది. మార్చి నుంచి బాలయ్య షూటింగ్ కు హాజరు కారు అంటున్నారు. అయితే మరీ ఎక్కువ కాలం కాదు..
గత కొద్ది కాలంగా బాలయ్య మంచి స్పీడు మీద ఉన్నారు. వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. హిట్ లు కొడుతున్నారు. సీనియర్ హీరోలలో బాలకృష్ణ కు ఉన్న డిమాండ్ మరో హీరోకు లేదనటం అతిశయోక్తి కాదు. తన రెమ్యునరేషన్ ని పెంచిన కూడా నిర్మాతలు వెనకాడటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ,యంగ్ డైరక్టర్స్ ని కలుస్తూ వారి కథలు వింటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య...లాస్ట్ ఇయిర్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య ఇచ్చిన దర్శకుడు బాబీతో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ కు కొద్దిరోజులు బాలయ్య బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...బాబి తో చేస్తున్న చిత్రం ఈ నెలాఖరకు షెడ్యూల్ పూర్తవుతుంది. మార్చి నుంచి బాలయ్య షూటింగ్ కు హాజరు కారు అంటున్నారు. అయితే మరీ ఎక్కువ కాలం కాదు..ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకూ వాటిపై దృష్టి పెడతారంటున్నారు. యాక్టర్ కమ్ పొలిటీషన్ అయిన బాలయ్య తన పొలిటికల్ యాక్టివిటీస్ ను ఫైనలైజ్ చేసుకుని తమ పార్టీ TDP కే పూర్తి సమయం కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తిరిగి ఆంధ్రాలో TDP వచ్చేలా ఆయన తన వంతు కృషి చేస్తారు. బాలయ్య ప్రస్తుతం హిందూపూర్ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మల్యేగా ఉన్నారు. దర్శక,నిర్మాతలు అందరికీ తెలుసు బాలయ్య ఎంత బిజీగా ఈ టైమ్ లో ఉంటారో..కాబట్టి సినిమా ప్రపోజల్స్ ఏమీ ఈ టైమ్ లో పెట్టరు. బాబితో షూటింగ్ ఎలక్షన్స్ అయ్యాక పూర్తి చేస్తారు. అలాగే కొత్త సినిమాల ఎనౌన్సమెంట్ సైతం ఎలక్షన్స్ తర్వాతే ఉంటుంది.
మరో ప్రక్క బాబీతే చేస్తున్న సినిమా తర్వాత బాలయ్య ఓ పీరియడ్ డ్రామా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు రాహుల్ సాంకృత్యన్. నాని, సాయి పల్లవి జంటగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిలిం “శ్యామ్ సింగ రాయ్” కు డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్. రాహుల్ సాంకృత్యన్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఇటీవల రాహుల్.. బాలయ్యను కలసి ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది కూడా ఓ పిరియాడిక్ డ్రామా అని అంటున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్యని పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకు రమ్మని చెప్పారని, ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. బాలయ్య పూర్తి కథ ఓకే చేయగానే...ఎనౌన్సమెంట్ వస్తుంది.