
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)తో పాటు.. రెడ్ జెయింట్ (Red Giant) బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మే నెల రెండవ వారంలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు బిజినెస్ బాగా జరిగినట్లు తెలుస్తోంది. కమల్ గత చిత్రం విక్రమ్ సినిమా 8 నుంచి 10 కోట్లకు అమ్ముడైతే, ఇప్పుడు ‘భారతీయుడు 2’ మాత్రం ఓ రేంజిలో అమ్ముడైంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 22 కోట్లకు అమ్మటం జరిగింది. ఇది కమల్ గత చిత్రానికి రెట్టింపు రేటు కావటం విశేషంగా చెప్తున్నారు. అయితే ఈ సినిమా నైజాం,ఆంధ్రా రైట్స్ ని (సీడెడ్ మినహా) ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి (సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్) వారు దక్కించుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కాదట. అయితే అడ్వాన్స్ ఎంత మొత్తం ఇచ్చారు అనేది బయటికి బయిటకు రాలేదు. ఇక సీడెడ్ ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ పై ఎన్.వి. ప్రసాద్ రైట్స్ తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఓవర్ సీస్ తెలుగు వెర్షన్ రైట్స్ కూడా భారీగానే వెళ్లాయి. అన్ని కలిపి 22 కోట్లు అని చెప్తున్నారు.
కమల్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ రూపొందుతోన్న సంగతీ తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి ప్రారంభం రోజు నుంచి క్రేజ్,ఇంట్రస్ట్ క్రియేట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో తెలుగులో బిజినెస్ మొదలైంది.
‘భారతీయుడు 2’ స్టోరీ లైన్ ని గమనిస్తే.. ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పటంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు మళ్లీ దేశంలో లంచగొండితనం పెరిగిపోతోంది. లంచం లేనిదే అధికారులు ఎవరూ ఏ పనులు చేయటం లేదు. దీంతో సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది. అప్పుడు భారతీయులందరూ కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగు పెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగు పెడతారు.( Bharateeyudu 2)
వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు.. భారతీయుడుకి భయపడి లంచాలు మానేసిన అధికారలు మళ్లీ లంచాలు తీసుకోవటానికి కారణం ఎవరు? పేట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి. అనే విషయాలను ఈ సినిమాలో చాలా గ్రాండియర్‌గా చూపించనున్నారు డైరెక్టర్ శంకర్. రిలీజైన గ్లింప్స్‌లోనే ఓ రేంజ్ గ్రాండియర్‌నెస్ ఉంటే ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా మేకింగ్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిన డైరెక్టర్ శంకర్, ఈసారి ‘భారతీయుడు 2’ చిత్రంతో ఎలాంటి సెన్సేషన్స్‌కు తెర తీయబోతున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే . రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.