పవన్ 28: భారీగా ట్రెండ్ అవుతున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్

Published : Jun 08, 2021, 03:32 PM IST
పవన్ 28: భారీగా ట్రెండ్ అవుతున్న ఫ్యాన్ మేడ్ పోస్టర్

సారాంశం

 పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వింటేజ్ బైక్ పై బ్లాక్ షర్ట్ ధరించి ఉన్న పవన్ చేతిలో ఓ కేసు పట్టుకొని స్టైలిష్ గా కూర్చొని ఉన్నారు. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ అదిరిపోయింది. ఆయన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సమ్మర్ కానుకగా విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ఆకలితో ఉన్న పవన్ అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. వకీల్ సాబ్ మూవీ ఫ్యాన్స్ అంచనాలు అందుకుంటూ మంచి విజయాన్ని నమోదు చేసింది. కాగా కమ్ బ్యాక్ తరువాత పవన్ వరుసగా చిత్రాలు ప్రకటించారు. 


క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ మూవీ, హరీష్ శంకర్ తో మరొక చిత్రం చేయనున్నట్లు అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. కాగా పవన్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ హరీష్ శంకర్-పవన్. 


గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ ఇద్దరు కలిసి మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. వారి కల సాకారం చేస్తూ పవన్ హరీష్ తో మూవీ ప్రకటించారు. పవన్ 28వ చిత్రంగా విడుదల కానున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. 


కాగా పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వింటేజ్ బైక్ పై బ్లాక్ షర్ట్ ధరించి ఉన్న పవన్ చేతిలో ఓ కేసు పట్టుకొని స్టైలిష్ గా కూర్చొని ఉన్నారు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా