బాలయ్య `అఖండ` మ్యూజికల్‌ రోర్‌.. `అడిగా అడిగా`తో స్టార్ట్

Published : Sep 17, 2021, 05:57 PM IST
బాలయ్య `అఖండ` మ్యూజికల్‌ రోర్‌.. `అడిగా అడిగా`తో స్టార్ట్

సారాంశం

బాలకృష్ణ తన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. తాను నటిస్తున్న `అఖండ` సినిమా ప్రమోషన్‌ షురూ చేశారు. ఈ చిత్ర మ్యూజికల్‌ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు. రేపు సినిమాలోని తొలి పాటని విడుదల చేయబోతున్నారు.

బాలకృష్ణ గేమ్‌ స్టార్ట్ చేశాడు. ఆయన నటిస్తున్న `అఖండ` చిత్ర మ్యూజికల్‌ ఫెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రంలోని తన రెండు రకాల గెటప్‌లతో కనువిందు చేసిన బాలయ్య టీజర్‌తోనూ దుమ్ములేపాడు. `అఖండ ఫస్ట్ రోర్‌` పేరుతో విడుదల చేసిన ఈ టీజర్‌ యాభై మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని దక్కించుకుంది. 

`అఖండ మ్యూజికల్‌ రోర్‌ బిగిన్స్` అంటూ ప్రకటించారు. రేపటి నుంచి పాటలను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ `అడిగా అడిగా.. ` పాటని శనివారం సాయంత్రం 5.33గంటలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. `సింహ`, `లెజెండ్‌` చిత్రాల అనంతరం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. దీంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?