ఆ పని చేసిన రజనీ ఫ్యాన్స్ కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రంగంలోకి దిగారు

pratap reddy   | Asianet News
Published : Sep 17, 2021, 05:13 PM IST
ఆ పని చేసిన రజనీ ఫ్యాన్స్ కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రంగంలోకి దిగారు

సారాంశం

అన్నాత్తే ఫస్ట్ లుక్ పోస్టర్ ముందు అభిమానులు మేకపోతుని బలి ఇచ్చిన సంఘటన వార్తల్లో వచ్చింది. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరూ మండిపడ్డారు.

సౌత్ లో సినిమా తరాలని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. అభిమాన హీరోల సినిమాలు విడుదలవుతుంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇంతవరకు ఓకె కానీ.. అభిమానం శృతి మించినప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే' చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. 

అన్నాత్తే ఫస్ట్ లుక్ పోస్టర్ ముందు అభిమానులు మేకపోతుని బలి ఇచ్చిన సంఘటన వార్తల్లో వచ్చింది. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరూ మండిపడ్డారు. రజనీకాంత్ అభిమాన సంఘ నాయకులు కూడా చర్యని ఖండించారు. 

రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి రక్తాభిషేకం చేసేందుకు ఫ్యాన్స్ ఈ సంఘటనకు పాల్పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. హీరోల కోసం మూగ జీవాలని బలి ఇవ్వడం ఏంటి అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. 

ఇదిలా ఉండగా మేకపోతుని బలి ఇచ్చిన రజనీ అభిమానులకు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెటా తమిళనాడు విభాగం రంగంలోకి దిగింది. మేకపోతుని బలి ఇచ్చిన అభిమానులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయబోతున్నారు అట. లా ప్రకారం పెటా ఈ కేసుని టేకప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

బహిరంగ ప్రదేశాల్లో మూగ జీవాలపై ఇలా ప్రవర్తించడం ఎనిమల్ యాక్ట్ ని ఉల్లంఘించడమే అని అంటున్నారు. ప్రస్తుతం మేకపోతుని బలి ఇచ్చిన అభిమానుల వివరాలని పెటా, తమిళనాడు పోలీసులు సేకరిస్తున్నారట. 

ఆ మధ్యన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అభిమానులు కూడా అతడి ఫ్లెక్సీ ముందు దున్నపోతుని బలి ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?