హైదరాబాద్‌లో బాలయ్య, శ్రీలీలా రచ్చ.. `NBK108`లో ఏం జరుగుతుంది?

Published : Apr 25, 2023, 10:04 PM IST
హైదరాబాద్‌లో బాలయ్య, శ్రీలీలా రచ్చ.. `NBK108`లో ఏం జరుగుతుంది?

సారాంశం

బాలకృష్ణ, శ్రీలీల కలిసి `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

నందమూరి నటసింహాం బాలకృష్ణ వరుస హిట్ల తర్వాత ఇప్పుడు మరో భారీ చిత్రంతో రాబోతున్నారు. ఎంటర్‌టైనర్‌మెంట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కానీ ఈ సినిమా భారీ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. గత చిత్రాలు పూర్తిగా యాక్షన్‌ మూవీస్‌ చేశాడు బాలకృష్ణ. కానీ ఈ సారి వినోదం, సెంటిమెంట్లు యాడ్‌ చేస్తున్నారు. తండ్రి కూతురు సెంటిమెంట్‌తో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. 

శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుందని తెలుస్తుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో సినిమా చిత్రీకరణ జరుగుతుందట. ఇందులో భారీ యాక్షన్‌ సీక్వెన్స్ షూట్‌ చేసినట్టు సమాచారం. యాక్షన్‌ సీన్లు పూర్తయ్యాయని, ఇప్పుడు బాలకృష్ణ, శ్రీలీల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో బాలయ్యకి కూతురిగా శ్రీలీల కనిపిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. కానీ కూతురు కాదని చిత్ర బృందం చెబుతుంది. మరి వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది ప్రశ్నగా మిగిలింది. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న కీలక సన్నివేశాల్లో బాలకృష్ణ, శ్రీలీల పాల్గొంటుందని, మరికొన్ని రోజులు ఇక్కడ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఇందులో కాజల్‌.. బాలకృష్ణకి భార్యగా నటిస్తుందా? లేక లవ్‌ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుందా? అనేది ఆసక్తికరం. ఇందులో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్‌ ఉందని, ప్లాష్‌ బ్యాక్‌లో మరో హీరోయిన్‌ కనిపిస్తుందని తెలుస్తుంది. ఆ హీరోయిన్‌ ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీలీల పాత్ర ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇందులో శ్రీలీల బాక్సర్‌గా కనిపిస్తుందనే ప్రచారం జరుగుతుంది. అందుకోసం శ్రీలీల శిక్షణ తీసుకుందట. ఇందులో నిజమెంతా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలో కనిపిస్తారట. మొదట తారకరత్నతో ఓ పాత్ర చేయించాలనుకున్నారు. కానీ  ఆయన హఠాన్మరణంతో ఆ స్థానంలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ని తీసుకున్నారట. ఈ సినిమాని విజయదశమి కానుకగా విడుదల చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?