`పీఎస్‌2` టార్చర్‌, `ఏజెంట్‌` మెరిసేదంతా బంగారు కాదు.. వివాదాస్పద క్రిటిక్‌కి చుక్కలు..

Published : Apr 25, 2023, 06:28 PM ISTUpdated : Apr 25, 2023, 06:30 PM IST
`పీఎస్‌2` టార్చర్‌, `ఏజెంట్‌` మెరిసేదంతా బంగారు కాదు.. వివాదాస్పద క్రిటిక్‌కి చుక్కలు..

సారాంశం

అఖిల్‌ `ఏజెంట్‌` మూవీ, మణిరత్నం `పీఎస్‌2` చిత్రాలపై నోరు పారేసుకున్నాడు వివాదాస్పద విమర్శకుడు ఉమైర్‌ సందు. ఈ చిత్రాలపై షాకింగ్‌ పోస్ట్ పెట్టాడు. అది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

ఓవర్సీస్‌ క్రిటిక్స్ ని అంటూ చెప్పుకునే ఉమైర్‌ సందు ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఒకప్పుడు సినిమాలకి ఫస్ట్ రివ్యూలంటూ చెప్పేవాడు. ఇప్పుడు హీరోహీరోయిన్ల పర్సనల్‌ వ్యవహారాలు పోస్ట్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నాడు. బ్రేకింగ్‌ అంటూ హీరోహీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వారి మధ్య అక్రమ సంబంధాలు అంటగడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లతో దుమారం రేపుతున్నాడు. తాను ఫేమస్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఆ మధ్య తెలుగు సినిమా `ఏజెంట్‌` షూటింగ్‌ సమయంలో అఖిల్‌, నటి ఊర్వశి రౌతేలా మధ్య సెట్‌లో ఏదో జరిగిందని, అఖిల్‌.. ఆమెని హరాస్‌ చేశాడంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి ఊర్వశి రౌతేలా స్పందించింది. ఆయనకు లీగల్‌ నోటీసులు పంపించింది. ఫేక్‌ ప్రచారానికి తెరలేపుతున్నాడని, అతన్ని అడ్డుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. అయినా తన అరాచకాలు ఆపాడం లేదు. మరోసారి `ఏజెంట్‌` సినిమాపై నోరు పారేసుకున్నాడు. అందులో `పీఎస్‌2`పై కూడా షాకింగ్‌ పోస్ట్ పెట్టాడు. 

తాను ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్‌గా చెలామణి అవుతున్నాడు ఉమైర్‌ సందు. అందులో భాగంగా అక్కడ సెన్సార్‌ రిపోర్ట్ కోసం ఆయన కూడా సినిమా చూసి, అది ఎలా ఉందోముందే చెబుతుంటాడు. ట్విట్టర్‌లో పోస్ట్ లు పెడుతుంటాడు. ఇప్పుడు `ఏజెంట్‌`, `పీఎస్‌2`పై కూడా పోస్ట్ లు పెట్టాడు. `పొన్నియిన్‌ సెల్వన్‌ 2` సినిమా `టార్చర్‌` అంటూ కామెంట్ పెట్టాడు. ఈ సినిమా అస్సలు బాగా లేదని ఆయన పోస్ట్ పెట్టగా, మణిరత్నం ఫ్యాన్స్ తోపాటు హీరోల ఫ్యాన్స్ లు కూడా ఉమైర్‌ సందుని ఆడుకుంటున్నారు. బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. 

ఇక అఖిల్‌ నటించిన `ఏజెంట్‌` చిత్రాన్ని ఉద్దేశించి `మెరిసేదంతా బంగారం కాదు` అని చెప్పాడు. పరోక్షంగా ఈ సినిమా కూడా బాగా లేదని, పైకి కనిపించే అంత లేదనే సెన్స్ లో ఆయన ఈ పోస్ట్ పెట్టాడు. ఇక అక్కినేని ఫ్యాన్స్ .. ఉమైర్‌ సందుని టార్గెట్‌ చేశారు. ఆయన్ని వల్గర్‌ లాంగ్వేజ్‌ ఉయోగించి తిడుతున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. మా సినిమాల గురించి నీకెందుకు అంటూ విమర్శిస్తున్నారు. ఆడుకుంటున్నారు. కామెంట్ల రూపంలో చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇది నెట్టింట రచ్చ రచ్చ అవుతుంది. 

అఖిల్‌ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న `ఏజెంట్‌` చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. ఇందులో ఆయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై టీమ్‌ ఎంతో నమ్మకం పెట్టుకుంది. సుమారు ఎనభై కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతటి భారీ రికవరీ సాధ్యమా? అనే సందేహాలున్నాయి. మరోవైపు మణిరత్నం రూపొందించిన `పొన్నియిన్ సెల్వన్‌ 2` సైతం ఈ నెల 28నే పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కానుంది. ఛోళా సామ్రాజ్యం కథతో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, శోభితా, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?