చిరంజీవిపై బాలయ్య సెటైర్.. మామూలుగా లేదుగా

Published : Apr 19, 2023, 05:02 PM IST
 చిరంజీవిపై బాలయ్య  సెటైర్.. మామూలుగా లేదుగా

సారాంశం

ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఆనందంతో షేర్ చేస్తూంటే చిరు అభిమానులు అవసరమా ఇప్పుడు ఇంత హంగామా అంటున్నారు.  


మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డిలను భారీసినిమాల నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్  వారు ఒకసారి చేసారు.సంక్రాంతి కోసమే పందెం పుంజుల్లా రెడీచేసిన ఈ సినిమాలను ఒకరోజు తేడాలో రెండింటినీ రిలీజ్ చేయటం అప్పుడు హాట్ టాపిక్. జనవరి 12 న బాలయ్య వీరసింహారెడ్డి, 13న చిరు నటించిన వీల్తేరు వీరయ్య లను రిలీజ్ చేసింది మైత్రీనిర్మాణ సంస్థ. రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడుతూ విజయం సాధించాయి. కలెక్షన్స్ కురిపించాయి. ఇద్దరు ఫ్యాన్స్ హ్యాపీ. మైత్రీ మూవీస్ మరీ హ్యాపీ. అయితే ఇప్పుడు వంద రోజులు పంక్షన్ ని వీరసింహా రెడ్డి టీమ్ జరుపుతోంది. ఈ క్రమంలో వేసిన పోస్టర్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.  సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్ వేసారు.

 హైదరాబాద్ లో ఈ పోస్టర్స్ అంతటా దర్శనిమిస్తున్నాయి. ఇవి చిరంజీవి అభిమానలుకు కోపం తెప్పిస్తున్నాయి. అందుకు కారణం...చిరంజీవి వార్తేరు వీరయ్యలో రవితేజ కూడా మరో హీరోగా కనిపించటం...ఆ విషయాన్ని ఈ పోస్టర్ సెటైర్ వెయ్యటం. బాలయ్య సింగిల్ హ్యాండ్ తోనే సెంచరీ కొట్టారని ఆ పోస్టర్ లో అంతరార్దం. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఆనందంతో షేర్ చేస్తూంటే చిరు అభిమానులు అవసరమా ఇప్పుడు ఇంత హంగామా అంటున్నారు.
 
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది.  ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వంద రోజులు పంక్షన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా హిందూపురంలో ఈ నెల 23న వంద రోజుల వేడుక జరుగనుందని సమాచారం. అయితే వెన్యూ ఎక్కడనేది ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా