
గలగలా మాట్లాడుతూ... చిన్న పిల్లల్లా గంతులేస్తూ.. హాడివిడితో పాటు స్పాంటియస్ గా పంచులు వేయడంలో సుమ తరువాతే ఇంకా ఎవరైనా... స్వతహాగా మలయాళీ అయినా.. సుమ మన అచ్చ తెలుగు ఆడపడుచులా.. అద్భుతమైన తెలుగులో మాట్లాడుతూ.. మన తెలుగు పిల్లలా మారిపోయింది. తెలుగు నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్ళి చేసుకుని.. హైదరాబాద్ లో సెటిల్ అయిన సుమ.. యాంకరింగ్ లో స్టార్ ఇమేజ్ సాధించి.. సెటిల్ అయిపోయింది.
స్టార్ హీరోల ప్రీ రిలీజ్ జరిగితే సుమ ఉండాల్సిందే. భారీ బడ్జెట్ సినిమాల ఫంక్షన్లకు ఆమె కనిపించాల్సిందే. అంతలా యాంకరింగ్ లో స్టార్ డమ్ సాధించిన యాంకర్ ఇంకెవరూ ఉండరేమో. అయితే... కొన్నాళ్ల క్రితం సుమ- రాజీవ్ తో విడాకులు తీసుకుంటందన్న రూమర్లు వచ్చాయి. దాదాపు విడిపోయిందన్న ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. ఇద్దరూ వేరేగా మరో ఇంట్లో ఉంటున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. దీంతో చాలామంది షాకయ్యారు. ఈ వార్తలో నిజం ఎంత అని ఆరాలు తియ్యడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలో ఈ వార్తపై కొన్ని కొన్ని ఫోటోలతో సమాధానం కూడా ఇచ్చింది సుమ.
అంతే కాదు సుమ, రాజీవ్ ఇద్దరూ ఈ వార్తలను పలు సందర్భాల్లో ఖండిస్తూ వచ్చారు. నార్మల్ గా భార్యభర్తల మధ్య గొడవలే తామిద్దరికి వచ్చాయని, విడిపోయేంత ప్రాబ్లమ్స్ ఏం లేవని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సుమ పోస్ట్ చేసే వీడియోల్లో రాజీవ్ పెద్దగా కనిపించలేదు దాంతో నెటిజన్లు మళ్లీ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. విడిపోలేదు అని ఖండించినా.. లోపల మాత్రం వారు కలిసి లేరంటూ.. విమర్షలు మొదలు పెట్టారు. దీంతో మళ్ళీ డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది.
ఇద్దరు పెద్దగా బయట కనిపించకపోవడం.. సోషల్ మీడియలో కూడా ఇద్దరు కలిసి యాక్టీవ్ గా ఉండకపోవడంతో..వీరిబంధంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఇక తాజాగా వీళ్లిద్దరూ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ..సమాధానం చెప్పారు. ఇద్దరు కలిసి పూజలో కనిపించడంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్లయింది. ఫ్యామిలీ అంతా బాగుండాలని.. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ పూజ చేసినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మీ పూజలో ఇద్దరు ఉన్న ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా సుమ కొడుకు రోషన్.. హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక సుమ అటు షోలు చేస్తూనే.. ఇటుసోషల్ మీడియాలో కూడా తన వీడియోలతో సందడి చేస్తుంది. ఇంట్లో సరదాగా తాను చేసే పనులు.. వండే వంటల గురించి వీడియోలు చేస్తుంటుంది సుమ. వాటికి కాస్త కామెడీ.. ఫన్ ను జోడించి అదరగొడుతుంది.