బాలకృష్ణ రైతు సినిమా కోసం కృష్ణ వంశీ కష్టాలు

Published : Jan 20, 2017, 05:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
బాలకృష్ణ రైతు సినిమా కోసం కృష్ణ వంశీ కష్టాలు

సారాంశం

పెండింగ్ లో పడ్డ రైతు సినిమా  అమితాబ్ కోసం కృష్ణవంశీ ఎదురు చూపులు బచ్చన్ వస్తేనే రైతు చేద్దామంటున్న బాలయ్య వేచి ఉండటం తప్ప మరో మార్గంలేని కృష్ణవంశీ

గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన ఘనవిజయంతో నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా సంతోషంగా ఉన్నాడు . ఈ సినిమా తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో రైతు చిత్రాన్ని చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రంలో అమితాబ్ నటిస్తేనే సినిమా పట్టాలెక్కు తుందని లేకపోతే రైతు సినిమానే ఉండదని అంటున్నాడు బాలయ్య . 

 

అయితే అసలు కారణం వేరే ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం. రైతు ల సమస్యలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని కోసం కొంతమంది రైతులు  మాత్రం తమ భూములను ఇవ్వడానికి నిరాకరించారు. అయితే వాళ్ళ దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కున్న విషయం తెలిసిందే . అలాంటిది అక్కడి సమస్యలతో కాకుండా తెలంగాణ నేపథ్యం అంటూ వివాదానికి తెరలేపుతున్నారు. ఇక బాలయ్య బావ చంద్రబాబు కూడా సినిమాని వాయిదా వేసుకోవాలని సూచించారట.

 

మరోవైపు నక్షత్రం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న కృష్ణ వంశీ అమితాబ్ డేట్స్ జూన్ వరకు ఖాళీ లేవని తేలడంతో ఏంచేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాడు. అమితాబ్ వచ్చేదెప్పుడు ఈ సినిమా పూర్తి అయేదెప్పుడు.. కృష్ణ వంశీకి మనశ్శాంతి ఎప్పుడు అని అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?