Kamal Vikram Movie: తెలుగులో భారీ రేటుకు కమల్ హాసన్ విక్రమ్ మూవీ రైట్స్.

Published : Mar 12, 2022, 01:34 PM ISTUpdated : Mar 12, 2022, 01:59 PM IST
Kamal Vikram Movie: తెలుగులో భారీ రేటుకు కమల్ హాసన్ విక్రమ్ మూవీ రైట్స్.

సారాంశం

తమిళ స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా విక్రమ్ ఈమూవీ తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. 

తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు కమలహాసన్ ఆయన సినిమా లేక చాలా కాలం అయ్యింది. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో కమల్ విశ్వరూపం2 తరువాత సినిమాలు చేయలేదు. అయితే ప్రతీ ఏడాది బిగ్ బాస్ రియాల్టీ షో మాత్రం చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. 

ఇక ఆయన ఇప్పుడు వరుస సినిమాలు సెట్స్ ఎక్కించాడు. అవి కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా విక్రమ్ రిలీజ్ కు రెడీ అయ్యింది.  తన సొంత బ్యానర్ పై కమల్ నిర్మించిన ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 14న  ఉదయం 7 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు మేకర్స్. 

కమల్ హాసన్ సినిమా అంటే తమిల్ లో ఎంత హడావిడి ఉంటుందో  తెలుగులో కూడా అంతే హడావిడి ఉంటుంది. తెలుగు ఆడియన్స్  ఇక్కడి సినిమాల మాదిరిగానే కమల్ సినిమాలు  ఆదరిస్తారు. కమల్ ను ఒక పరభాషా నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అనుకోలేదు. అందువలన ఆయన సినిమాలు ఇక్కడ భారీ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి. అంతే కాదు ఇక్కడ కూడా ఆయన సినిమాలు భారీ రేటు పలుకుతుంటాయి. అలాగే తమిళంతో పాటు తెలుగులోను విక్రమ్ సినిమా భారీస్థాయిలో రిలీజ్ కాబోతోంది. 

ఇక విక్రమ్ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు కూడా భారీ రేటు పలికినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులు 11 కోట్లకు అమ్ముడయ్యాయట. కమల్ హాసన్ కు ఇక్కడ ఉన్న  క్రేజ్ తో పాటు, దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి గల ఇమేజ్ వల్ల తెలుగులో ఈ స్థాయి రేటుకు ఈ సినిమా అమ్ముడు అయ్యిందంటున్నారు సినిమా పండితులు. ఇక ఈ సినిమాలో  విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ వంటి  స్టార్ ఆర్టిస్టులు ఉండటం కూడా మరో కారణమని చెప్పుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా