బాలకృష్ణ, అనిల్ రావిపూడి మూవీ ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

By team teluguFirst Published Dec 17, 2022, 6:09 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. అఖండ చిత్రంతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు. 

నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. అఖండ చిత్రంతో బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సాలిడ్ బజ్ క్యారీ అవుతోంది. ఈ తరుణంలో బాలకృష్ణ మరో చిత్రాన్ని కూడా ప్రారంభించారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. షూటింగ్ సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. 

ఈ చిత్ర షూటింగ్ కి వెళుతున్న జూనియర్ ఆర్టిస్టులు ప్రమాదానికి గురయ్యారు. ఈ తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఆర్టిస్టులు వాహనంలో షూటింగ్ లొకేషన్ బాచుపల్లికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రగతి నగర్ చెరువు వద్ద ప్రమాదానికి గురై బోల్తా కొట్టింది. 

దీనితో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. అనిల్ రావిపూడి.. బాలయ్యతో యాక్షన్ కామెడీ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి చిత్రాల్లో కామెడీ ప్రధానంగా ఉంటుంది. దీనితో బాలయ్యని ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. 

click me!