
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో హిట్ అందుకునన్నారు. ఇప్పుడు వింటేజ్ లుక్ లో అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వస్తున్న మాస్ అప్డేట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. గతంలో రిలీజ్ ‘బాస్ పార్టీ’ఫస్ట్ సింగిల్ ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండింగ్ లోనే ఉంది. ఈలోగా సెకండ్ సింగిల్ ను కూడా సిద్ధంగా ఉంచారు.
తాజాగా ‘వాల్తేరు వీరయ్య’రెండో పాటను కూడా విడుదల చేసేందుకు డేట్ ను ఫిక్స్ చేశారు. తొలుత మాస్ బీట్ తో ఆకట్టుకున్న టీమ్ ప్రస్తుతం మెలోడీతో రాబోతోంది. ఇప్పటికే రెండో పాటపై చిరంజీవి లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే పాటను విడుదల చేయబోతున్నారు. ‘శ్రీదేవి చిరంజీవి’ (Sridevi Chiranjeevi) అనే టైటిల్ తో సెకండ్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 19న సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. కూల్ వింటర్ లో రాకింగ్ లవ్ మెలోడీగా సంగీత ప్రియులను అలరించబోతోంది.
ఈ అప్డేట్ అందిస్తూ అదిరిపోయే పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. మంచు కురిసే అందమైన లోకేషన్ లో చిరంజీవి - శృతి హాసన్ (Shruti Haasan) రొమాంటిక్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆరెంజ్ బ్లేజర్ లో చిరంజీవి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. వైట్ ప్రింటెడ్ శారీలో శృతి హాసన్ హృదయాలను కొల్లగొట్టింది. చూడగానే ఆకర్షించే పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పోస్టరే ఇంత రొమాంటిక్ గా ఉంటే.. ఇంకా సాంగ్ ఎంత బాగుటుందో అర్థమవుతోంది.
రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధం అవుతోందీ చిత్ర యూనిట్. ఇందులో ఇప్పటికే ఒక పాటను ఫ్రాన్స్ లో పూర్తి చేశారు. మరో సాంగ్ ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఇండియాకు తిరిగి వచ్చి.. ప్రమోషన్స్ ను మరింత జోరుగా నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. చిరు వింటేజ్ లుక్ లో కనిపించబోతుండటం, మాస్ మహారాజ ముఖ్య పాత్రలో అలరించబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాకింగ్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏఢాది జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.