
టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీ.. కన్నడాలో కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీ మధ్య అనుబంధం మామూలుది కాదు. ముఖ్యంగా బాలయ్య అంటే శివరాజ్ కుమార్ తో పాటు.. దివంగత పునిత్ రాజ్ కుమార్ కు కూడా చాలా ఇష్టం. బాలయ్య కాని.. వారు కాని రెండు ఫ్యామిలీలు ఇంట్లో మనుషుల్లా కలిసిపోయి ఉంటారు. పునిత్ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య బాబు కన్నీరు పెట్టుకున్నారు. అంత అనుబంధం వీరిది. ఇక ఈరెండు ఫ్యామిలీల హీరోల నుంచి మల్టీ స్టారర్ మూవీ వస్తే చూడాలని. అటు కన్నడ, ఇటు తెలుగు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరకుంటున్నారు.
ఈక్రమంలో కన్నడ స్టార్ సీనియర్ హీరో శివరాజ్ కుమార్..అలియాస్ శివయ్య..ఇటు నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు కన్నడ హీరో శివరాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరయిన శివయ్యా.. తాము, బాలయ్య మంచి స్నేహితులమని. తన తండ్రి రాజ్ కుమార్, ఎన్టీఆర్ కూడా మంచి స్నేహుతలన్నారు. దాంతో మాకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ మా స్నేహం ఇంకా బలపడుతుంది. బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళం. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాం అని తెలిపారు. ఈ మాటతో.. స్టేజ్ దద్దరిల్లింది. నందమూరి, కంఠీరవ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఈసినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా..ఎప్పుడెప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా అని చూస్తున్నారు.
ఇక ఈ వేడుకలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ సర్ శత జయంతి ఉత్సవాలకు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మేము కూడా చెన్నైలోనే పెరిగాము. రోజూ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చెన్నైలో ఎన్టీఆర్ ఇంటి మీద నుంచి వెళ్ళేవాళ్ళం. డైలీ అక్కడ ఫుల్ గా జనాలు ఉండేవారు. ఆ జనాల్ని దాటుకొని వెళ్ళడానికి కనీసం 5 నిముషాలు పట్టేది. మాకు అది చూడటం డైలీ రొటీన్ అయిపొయింది. ఒక హీరో కోసం రోజూ అంతమంది క్రౌడ్ అంటే మాములు విషయం కాదు. ఎన్టీఆర్ సర్ సీఎం అయ్యాక ఫిలింఫేర్ అవార్డ్స్ హైదరాబాద్ లో జరిగితే సీఎం లా కాకుండా ఒక మాములు నటుడిలా వచ్చే అందరి గెస్టులని ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకున్నారు, అది ఆయన గొప్పతనం అని అన్నారు.