బాలకృష్ణను రంగంలోకి దింపుతోన్న బోయపాటి!' సింహం' మళ్లీ గర్జిస్తుందా?

Published : Mar 16, 2018, 05:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బాలకృష్ణను రంగంలోకి దింపుతోన్న బోయపాటి!' సింహం' మళ్లీ గర్జిస్తుందా?

సారాంశం

ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ  చరణ్ మూవీతో బోయపాటి  ఆ తరువాత సెట్స్ పైకి బాలయ్య .. బోయపాటి  

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. బాలకృష్ణ కెరియర్లోనే కొత్తరికార్డులను తిరగరాశాయి. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఈ నెల 29నుంచి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగులో బిజీ అవుతారు. ఇక చరణ్ హీరోగా చేస్తోన్న సినిమాతో బోయపాటి తీరికలేకుండా వున్నారు.

దాదాపు ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ తరువాత బాలకృష్ణ - బోయపాటి సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10వ తేదీన, ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగొచ్చని అంటున్నారు. ఈ సినిమాతో బాలయ్యకు .. బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Alia Bhatt AI Images: అలియా భట్‌ ఫేక్ ఫోటోలతో పాకిస్థాన్ లో దారుణం, స్టార్స్ కి తలనొప్పిగా AI టెక్నాలజీ..
కొరియా అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. రాష్ట్రపతి భవన్‌ లో ప్రియాంక మోహన్ డిన్నర్