Balakrishna Shooting: యాక్షన్ కు రెడీ అయిన బాలయ్య... సిరిసిల్లలో షూటింగ్ షురూ...

Published : Feb 18, 2022, 03:59 PM IST
Balakrishna Shooting: యాక్షన్ కు రెడీ అయిన బాలయ్య...  సిరిసిల్లలో షూటింగ్ షురూ...

సారాంశం

బాలయ్య బాబు(Balakrishna) ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అఖండ సక్సెస్ తో స్పీడ్ పెంచాడు బాలకృష్ణ(Balakrishna). కొన్నాళ్లు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన బాలయ్య.. ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేశాడు.

బాలయ్య బాబు(Balakrishna) ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అఖండ సక్సెస్ తో స్పీడ్ పెంచాడు బాలకృష్ణ(Balakrishna). కొన్నాళ్లు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన బాలయ్య.. ఇప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేశాడు.

నట సింహం బాలకృష్ణ(Balakrishna) దూకుడికి ఇండస్ట్రీ శేక్ అవుతుంది. తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు.  రీసెంట్ గా అఖండతో సూపర్ సక్సెస్ కొట్టిన బాలకృష్ణ(Balakrishna). ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వరుసగా కథలు కమిట్ అవుతూ.. ఒకదాని వెంట మరొకటి చేసుకుంటూ పోతున్నాడు బాలయ్య.

గతంలో కమిట్ అయిన మలినేని గోపీచంద్ సినిమా షూటింగ్ ను షురూ చేశాడు బాలకృష్ణ (Balakrishna). ఈరోజు (ఫిబ్రవరి 18) సిరిసిల్ల పరిసర ప్రాంతంలో బాలయ్య సినిమా షూటింగ్ మొదలయ్యింది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ లతో రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా అంటేనే మాస్.. యాక్షన్ సీక్వెన్స్ లు.. భారీ డైలాగ్స్ తో వెండి తెర వణికి పోతుంది. ఇక ఇప్పుడు అంతకు మించి అన్నట్టు యాక్షన్ చూపించడాని రెడీ అవుతున్నాడు నట సింహం.

రాయలసీమ ప్రాంతం వేట పాలెం నేపధ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాకు వేటపాలెం, పెద్దాయన లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. శృతి హాసన్ హిరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ మిళితంగా సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

మలినేని గోపీచంద్ తో ఈ సినిమా కంప్లీట్ అయిన తరువాత అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య(Balakrishna) జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తరువాత పూరీ జగన్నాథ్ తో కూడా బాలకృష్ణ(Balakrishna) సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంత మంది డైరెక్టర్లు బాలకృష్ణ(Balakrishna) కోసం క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలు చేస్తూనే.. వరుసగా కథలు వింటున్నారు స్టార్ సీనియర్ హీరో.

మరో వైపు బాలయ్య(Balakrishna) దూకుడుకు వెండితెరతో పాటు బుల్లి తెర కూడా అదిరిపోయింది. మొదటి తెలుగు ఓటీటీ యాప్ ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ స్పెషల్ టాక్ షో చేశారు బాలకృష్ణ(Balakrishna). స్టార్ సూపర్ స్టార్ గెస్ట్ లతో ఫస్ట్ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక రెండో సీజన్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాల హడావిడి అయిపోయిన్ తరువాత సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా