
సినీ నటుడు, వైసీపి నాయకుడు ఆలీ విషయంలో గత కొంత కాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఆలీని ఆంధ్ర హజ్ కమిటీ సభ్యులు కలిసారు.
గత కొంత కాలంగా సినీ నటుడు ఆలీ విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అలీకి ప్రభుత్వంలో మంచి పదవి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా సినిమా పెద్దలలతో ప్రభుత్వ చర్చల్లో పాల్గొన్న ఆలీ.. ఆతరువాత జగన్ తో మరోసారి భేటీ అయ్యారు. త్వరలో గుడ్ న్యూస్ వింటారని ఆలీకి జగన్ చెప్పినట్టు తెలిసంది. ఇక ఈ స్టార్ కమెడియన్ కు ప్రభుత్వంలో ఏ పదవి దగ్గబోతుంది అన్న విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.
ఈ నేపధ్యంలో ఆలీకి రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తారు అన్న ప్రచారం జరిగింది. దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అనుకున్నారు. కాని ఇప్పుడు ఆలీని ఏపీ వక్స్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయని.. ప్రభుత్వం ప్రకటించడమే తరువాయి అని తెలుస్తోంది.
ఇక తాజాగా సినీ నటుడు ఆలీ ని మర్యాదపూర్వకంగా కలిసారు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్, సభ్యులు. హైదరాబాద్లో సినీ నటుడు, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నాయకులు ఆలీ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ నెల 24న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ సమావేశానికి సినీ నటుడు ఆలీ ఆహ్వానించారు.
అటు ఆలీ కూడా కొత్త హజ్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆహ్వానాన్ని స్వీకరించి, సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ B.S గౌసుల్ ఆజం, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ఇబాదుల్లా ఖురైషీ, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పుంగనూరు ఖాదర్ బాషా, రాష్ట్ర మైనారిటి విభాగం ప్రధాన కార్యదర్శి నయీమ్, వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇక సినీ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆలీ.. వైసీపీలో జాయిన్ అయ్యి.. రాజకీయ జీవితం స్టార్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్టార్ కమెడియన్ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తన సొంత ప్రాంతం రాజమండ్రి చుట్టుపక్కల నుంచే ఆయనకు టికెట్టు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇది కాకపోతే ఎంపీగా అయినా అలీకి అవకాశం ఉందని ప్రచాంరం జరుగుతోంది. ఈ పేపధ్యంలో కీలక వర్స్ బోర్డ్ చైర్మగా అలీ నీయామకం జరగబోతుండటం విశేషం.