టాలీవుడ్ టాప్ హీరో సినిమాకు బిజినెస్ కరువు?

Published : Nov 06, 2017, 10:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
టాలీవుడ్ టాప్ హీరో సినిమాకు బిజినెస్ కరువు?

సారాంశం

నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న జై సింహా చిత్రం కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సి.కళ్యాణ్ పైసావసూల్ దెబ్బకు భయపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వేగం పెంచారు. పూరీ దర్శకత్వంలో తన 101 సినిమా పైసా వసూల్‌ను శరవేగంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో జై సింహతో వస్తున్నాడు.

 

బాలయ్య పైసావసూల్ సినిమా బిజినెస్ ప్రభావం ప్రస్థుత చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ గురించి సినీ వర్గాల్లో ఓ చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. నిజానికి గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత పైసా వసూల్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పైసా వసూల్ చిత్రానికి దాదాపు రూ.33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ పైసా వసూల్ చిత్రానికి రిలీజైన తొలి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ కలెక్షన్లను కొల్లగొడుతుందనుకుంటే... తొలివారాంతం తర్వాత పైసా వసూల్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొత్తంగా ఈ చిత్రం దాదాపు 20 కోట్లు వసూలు చేసి.. దాదాపు 13 కోట్ల నష్టాన్ని డిస్టిబ్యూటర్లకు పంచినట్టు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు.

 

పైసావసూల్ చిత్ర కలెక్షన్ల దెబ్బ బాలయ్య తదుపరి చిత్రం జై సింహపై భారీగానే పడుతోందట.  డిస్టిబ్యూటర్లు జైసింహ సినిమా గురించి ముందు వెనుకా ఆలోచిస్తున్నారట. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం... పండగ సీజన్ లో వచ్చే ఇతర భారీ చిత్రాలను తట్టుకుంటుందా లేదా అనే డౌట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లను తొలుస్తోంది. దీంతో కలెక్షన్స్ వరకు వెళ్లడం తరువాత కానీ అసలు ఏ విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందో అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బాలయ్య సినిమాకు ఈ టాక్ రావడం ఏంటో అర్థం కావట్లేదు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?