Balakrishna: బాలయ్య హిందీ బూతులా మజాకా... సోషల్ మీడియా షేక్ సామీ!

By Sambi ReddyFirst Published Jan 24, 2023, 1:31 PM IST
Highlights

బాలయ్య హిందీ బూతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీమ్ రాయుళ్లు బాలయ్య మాటలు సింక్ చేస్తూ ఫన్నీ వీడియోలు చేస్తూ ట్రోల్స్ కి తెగబడ్డారు. 

బాలయ్య నోటి వెంట బూతులు, అనుచిత వ్యాఖ్యలు చాలా కామన్. అమ్మాయి కనబడితే ముద్దైనా పెట్టాలి. కడుపైనా చేయాలని చెప్పిన ఘనుడు. సినిమాల్లోనేమో స్త్రీలు దేవతలు, వారి పూజించాలని ఎమోషనల్ డైలాగ్స్ కొడతారు. పబ్లిక్ లో బాలయ్యకు ఎలా మసలుకోవాలో కనీసం తెలియదు. ఏదో మత్తులో ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. సందర్భానికి ఆయన మాటలకు పొంతన ఉండదు. ఎక్కడ నుండి ఎక్కడికిపోతారో అర్థం కాదు. 

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో ఆయనకు హిందీ మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో? అసలు నిజాం కాలేజీ రోజులు ఎందుకు గుర్తు చేసుకున్నారో? ఆ దేవుడికే తెలియాలి. గత స్మృతులు తలచుకుంటే పర్లేదు. లక్షల మంది వీక్షించే ఈవెంట్ అనే సోయ లేకుండా బూతులు పలికాడు. మేము చదువుకునే రోజుల్లో హిందీ మాటలతోనే పలకరింపు మొదలు పెట్టేవాళ్ళం... ''అరె సాలే కైసా...'' అంటూ రాయలేని హిందీ బూతు పదాలు పలికాడు. 

ఇక బాలయ్య హిందీ బూతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీమ్ రాయుళ్లు బాలయ్య మాటలు సింక్ చేస్తూ ఫన్నీ వీడియోలు చేస్తూ ట్రోల్స్ కి తెగబడ్డారు. ఈ రెండు రోజుల్లో వేలకొలది సోషల్ మీడియా మీమ్స్ పుట్టుకొచ్చాయి. బాలయ్య ఫ్యాన్స్ ఫీలింగ్ ఏమిటో కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ మీమ్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో సారే జహాసే అచ్చా... పాడుతూ బుల్ బుల్ అంటూ అబాసు పాలయ్యాడు. హిందీలో నరేంద్ర మోడీకి వార్ణింగ్ ఇచ్చి కామెడీ పంచారు. 

మనకు రాని భాషలో మాట్లాడటం అవసరమా చెప్పండి. చుట్టూ తెలుగోళ్లు ఉన్నప్పుడు బాలయ్యకు ఈ హిందీ పాండిత్యం ఎందుకు. అది చాలదన్నట్లు అక్కినేని తొక్కినేని అంటూ కొత్త వివాదానికి తెరలేపాడు. బాలయ్య ఏఎన్నార్ ని కించపరిచాడంటూ నాగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. బాలయ్య మాటల కారణంగా తండ్రి ఎన్టీఆర్ గౌరవాన్ని తగ్గించే వీడియోలు నాగార్జున ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  

వీరసింహారెడ్డి మూవీలో కంటెంట్ లేకపోయినా పండగ పుణ్యమా అని హిట్ కొట్టింది. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉండక అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నాడు. ఏడాదికో వివాదం బాలయ్యకు పరిపాటిగా మారింది. అరవైయేళ్లు వస్తున్నా ఆయనలో ఆశించిన మెచ్యూరిటీ రావడం లేదు. వయసు పెరిగేకొద్ది దుందుడుకు స్వభావం తగ్గాల్సింది పోయి ఆయనలో పెరుగుతుంది. కాగా వీరసింహారెడ్డి బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. 

click me!