Ashureddy: పెళ్ళైన వారానికే మొగుడికి విషం పెట్టి చంపేస్తుందట!

By Sambi ReddyFirst Published Jan 24, 2023, 12:11 PM IST
Highlights


బోల్డ్ బ్యూటీ అషురెడ్డి పెళ్ళైన వారానికే మొగుడికి కాఫీలో విషం పెట్టి చంపేస్తుందట. ఆమె ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ అవును నువ్వు ఆ టైపే అని కామెంట్ చేస్తున్నారు. 
 

అషురెడ్డి అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తుందనే వాదన ఉంది. స్కిన్ షోకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఈ బిగ్ బాస్ బ్యూటీ... రామ్ గోపాల్ వర్మతో బూతు ఇంటర్వ్యూలు చేసి మరింత పాపులర్ అయ్యారు. వర్మ ఈమె ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ సదరు ఇంటర్వ్యూలలో పచ్చి కామెంట్స్ చేశారు. సెకండ్ ఇంటర్వ్యూ అయితే అరాచకానికి పరాకాష్ట. ఆమె కాలి వేళ్ళు వర్మ నోట్లో పెట్టుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ విషయంలో వర్మతో పాటు అషురెడ్డిని జనాలు ఓ రేంజ్ లో ఏకిపారేశారు. 

జనాలు అలా రియాక్ట్ అవుతారని వాళ్లకు తెలుసు. అందరూ తమ గురించి మాట్లాడుకోవాలనే కదా వారు నిస్సుగ్గుగా చేసేది. సో వాళ్ళ ప్రణాళిక ఫలించినట్లే లెక్క. గతంతో తల్లిని అయ్యానంటూ అషురెడ్డి ఫ్రాంక్ వీడియో చేసింది. వాళ్ళ అమ్మ చెప్పుతో కొట్టబోయింది. పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యను అవుతా అని మరో సంచలన కామెంట్ చేసింది. చెప్పుకుంటూ పోతే ఆమె ఘోరాలు చాలానే ఉన్నాయి. 

తాజాగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో ''పెళ్ళైన వారానికే కాఫీలో విషం పెట్టి మొగుడిని చంపేస్తా' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్ కోర్స్ అది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యా మీనన్ చెప్పిన డైలాగ్ అనుకోండి. అయినప్పటికీ అషురెడ్డి రీల్ చూసిన నెటిజెన్స్... నిజంగా నువ్వు అదే టైపని కామెంట్ చేస్తున్నారు. అషురెడ్డి వీడియో వైరల్ అవుతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

బీభత్సంగా స్కిన్ షో చేస్తున్న అషురెడ్డిని జనాలు విపరీతంగా తిడుతున్న నేపథ్యంలో కౌంటర్ ఇస్తూ ఆ మధ్య ఓ వీడియో చేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవలు అంటూ పరోక్షంగా తిట్టిపోసింది. కాగా బిగ్ బాస్ సీజన్ 3 లో అషురెడ్డి పాల్గొన్నారు. అయితే ఆమె జర్నీ ఎక్కువ రోజులు సాగలేదు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే రూమర్స్ ఉన్నాయి. 
 

click me!